Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు అండగా ఏపీ సీఎంఓ..

Punch Prasad Health: గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది.

Update: 2023-06-09 10:30 GMT

Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు అండగా ఏపీ సీఎంఓ..

Punch Prasad Health: గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో సుమారు అయిదారు రోజుల నుంచి జబర్దస్త్ కమెడియన్లందరూ పంచి ప్రసాద్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతూ డబ్బులు తోచినంత సహాయం చేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

తాజాగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తన టీం పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లోకి వెళ్లిందని వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ఆయన అనారోగ్య సమస్యలు క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News