Ajith Kumar: స్టార్ హీరో అజిత్ ఇంట విషాదం
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అజిత్ తండ్రి పి.సుబ్రమణియం (84) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.