Samantha: చై, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత.. తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన సమంత
Samantha: ఇదిలా ఉంటే ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్ సినిమాలపై ఫోకస్ పెంచారు.
Samantha: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో నటి సమంత ఒకరు. నిత్యం ఏదో ఇక విషయంపై పోస్ట్‌లు చేస్తుంటుంది సామ్. అయితే ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేస్తుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి కారణం నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ కావడమే. వీరిద్దరి ఎంగేజ్మెంట్పై సామ్ ఎలా స్పందిస్తుందన్న దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది.
అయితే సామ్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇతర అంశాలకు సంబంధించిన పోస్టులు చేసింది కానీ, వారి ఎంగేజ్‌మెంట్‌ను ఉద్దేశిస్తూ ఎలాంటి పోస్టులు చేయలేదు. అయతే తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టైలిష్ లుక్‌లో ఉన్న సామ్ టీ షర్ట్‌పై రాసి ఉన్న కొటేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం’ అని ఉన్న కొటేషన్ ఆలోజింపజేస్తోంది.
కాగా ఈ ఫొటోతో పాటు సామ్ 'నౌ వీ ఆర్ ఫ్రీ' అనే ఒక ఇంగ్లిష్ సాంగ్‌ను సైతం యాడ్ చేసింది. దీంతో సమంత చేసిన పోస్ట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ పోస్ట్ కచ్చితంగా నాగచైతన్య ఎంగేజ్మెంట్కు సంబంధించే చేసి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటో ఎవరికో ఏదో సందేశం ఇస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు సామ్ చాలా బాగున్నారు అంటూ పొగడ్తలు కురిపించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్ సినిమాలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ తర్వలోనే స్ట్రీమింగ్కు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ దర్శకుడితో సామ్ ప్రేమలో పడిందంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సమంత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.