Samantha: అది నా జీవితాన్నే మార్చేసింది.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషరేష్ తీసుకున్న హీరోయిన్ల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సామ్. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయమైంది ఈ చిన్నది.
Samantha Ruth Prabhu: నటి సమంత.. ఈ పేరును సినీ లవర్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఒకరిగా ఎదిగారు సమంత. ఏం మాయ చేశావేతో మొదలైన సమంత సినీ ప్రయాణం.. అనంతరం వరుస విజయాలతో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళంలో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిందీ సినిమా.
దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషరేష్ తీసుకున్న హీరోయిన్ల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సామ్. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయమైంది ఈ చిన్నది. దీంతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో ఎంత స్ట్రాంగ్ పాత్రల్లో నటిస్తుందో, రియల్ లైఫ్‌లోనూ సామ్ అలాగే ఉంటుంది. ఆరోగ్య విషయంలో, పెళ్లి విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడింది. తన సినిమా ప్రయణాన్ని కొనసాగిస్తూనే ఉంది.
మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ కింగ్ షారూక్‌ఖాన్‌తో కలిసి ఒక చిత్రం, మలయాళంలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం, తమిళంలో విజయ్‌కు జంటగా ఒక చిత్రం చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సమంత నటించి వెబ్ సిరీస్ సిటాడెల్ సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు సామ్.
అసలు సమంత నటిగా ఎందుకు మారాల్సి వచ్చిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను సాధారణ కుంటుంబంలో పుట్టిన అమ్మాయినని, తన ఉన్నత చదువుకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో తన తండ్రి ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే మరో మార్గం లేక తాను సినిమాల్లో రావాల్సి వచ్చిందని తెలిపింది. ఒకానొక సమయంలో కేవలం రూ. 500 కోసం హోటల్‌లో హోస్ట్‌గా కూడా పనిచేసినట్లు సమంత గతాన్ని గుర్తు చేసుకుంది. సినిమా తన జీవితాన్నే మార్చేసిందని సమంత చెప్పుకొచ్చింది.