Samantha: 'మీ జీవనం చెప్పడం అంత సులభం కాదు'.. ఉర్ఫీపై సమంత ప్రశంసల జల్లు
Uorfi Javed: నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ట్రెండింగ్ నిలుస్తుంది.
Samantha Ruth Prabhu Praises Urfi Javed: నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ట్రెండింగ్ నిలుస్తుంది. విభిన్నమైన దుస్తులు ధరిస్తూ, బోల్డ్ లుక్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఉర్ఫీకి ప్రశంసల కంటే ఎక్కువగా విమర్శలే ఎదురవుతుంటాయి. సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా అందాల తార సమంత ఉర్ఫీకి మద్ధతుగా నిలిచారు.
'ఫాలో కర్‌లో యార్' అనే రియాలిటీ షోలో పాల్గొన్న ఉర్ఫీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ రియాలిటీలో ఉర్ఫీ ఎమోషన్ అయ్యారు. చిత్ర పరిశ్రమంలో తనకు మద్ధతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరంటూ వాపోయారు. అయితే దీనిపై నటి సమంత స్పందించారు. ఉర్ఫీపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
'మీ జీవనం చెప్పడం అంత సులభం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మీరు అదృష్టవంతులైతే గౌరవంతో పాటూ ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రయాణాన్ని గౌరవిస్తారు. లేదంటే అపహాస్యం పాలవుతారు. ఇప్పుడే మీరు కెరీర్ ఆరంభించారు. దాన్ని ఇలాగే కొనసాగించండి' అంటూ ఉర్ఫీని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది సామ్.
సమంత చేసిన పోస్ట్‌పై స్పందించిన ఉర్ఫీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇవి భావోద్వేగ క్షణాలంటూ.. ఈ రాత్రంతా కంటతడి పెట్టుకుంటానేమో. సమంత.. సపోర్ట్ చేయడంలో మీలాంటి మహిళను నేను ఇప్పటి వరకూ చూడలేదు అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.