Sarath Babu Last Wish: ఆఖరి కోరిక నెరవేరకుండానే మరణించిన శరత్ బాబు..
Sarath Babu Last Wish: మూడు దశాబ్దాల పాటు అత్యంత ప్రతిభావంతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు వెండితెరపై చెరగని ముద్ర వేశారు.
Sarath Babu Last Wish: మూడు దశాబ్దాల పాటు అత్యంత ప్రతిభావంతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు వెండితెరపై చెరగని ముద్ర వేశారు. తన సుదీర్ఘ నటజీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో త్యాగపూరితమైన క్యారెక్టర్స్ లో, మరెన్నో సార్లు బెస్ట్ ఫ్రెండ్ గా నటించినా..ఎన్నడూ మొనాటనీని దరిచేరనివ్వలేదు..అదే ఆయనలోని స్పెషాలిటీ.
ఏడు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా కనిపించే శరత్ బాబు ఈ ఏడాది చివరిగా నరేష్-పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించారు. ఇదే ఆయన చివరి సినిమా. మే నెల 1న అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పత్రికి తరలించారు. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తో ఆస్పత్రిలో చేరిన శరత్ బాబును వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా లాభం లేకుండాపోయింది. మే 22న ఆయన కన్నుమూశారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ నటుడిగా వెలుగొందారు శరత్ బాబు. అయితే ఇంత చేసినా..తన చివరి కోరిక నెరవేరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరత్ బాబుకు హార్సిలీహిల్స్ లో స్థలం ఉంది. ఆ స్థలంలో ఆయన 1985లోనే ఓ ఇంటిని నిర్మించాలనుకున్నారు. ఇంటి పనులను కూడా ప్రారంభించారు కొంత నిర్మాణం జరిగిన తర్వాత ఏ కారణం చేతనో ఆపేశారు. ఈ ఇంటిని కొనుగోలు చేస్తామని చాలా మంది అడిగినా...శరత్ బాబు మాత్రం అమ్మేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే, అక్కడ ఇంటిని నిర్మించి స్థిరపడాలనేది ఆయన చిరకాల కోరిక. హార్సిలీహిల్స్ కు చివరిగా 2021 మార్చ్ 24న వెళ్లిన శరత్ బాబు అక్కడి స్థానికులతో త్వరలోనే వస్తానని..ఇక్కడే స్థిరపడతానని చెప్పారట. కానీ, ఇల్లు నిర్మాణం పూర్తికాకుండానే, అక్కడ స్థిరపడాలనే తన కోరిక తీరకుండానే శరత్ బాబు కన్నుమూశారు. తిరిగిరాని తీరాలకు తరలిపోయిన శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.