HIT3: హిట్‌3లో అందాల తార.. నానికి జోడిగా కేజీఎఫ్‌ బ్యూటీ?

నాని పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Update: 2024-10-02 13:29 GMT

HIT3: హిట్‌3లో అందాల తార.. నానికి జోడిగా కేజీఎఫ్‌ బ్యూటీ? 

నాని హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం హిట్3. శైలేశ్‌ కొలను హిట్‌ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న మూడో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. విశ్వక్‌సేన్‌, అడివిశేష్‌లు అద్భుత నటన, శైలేజ్‌ దర్శకత్వం ఈ సిరీస్‌ మూవీస్‌లను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడీ జాబితాలోకి నాని వస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

నాని పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌ క్యూరియాసిటీని పెంచేసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్నదానిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేజీఎఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుండగా నాని, శ్రీనిధిలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెల రెండో వారం వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్‌ సంగీతం వహిస్తుండగా, సాను జాన్‌ వర్గీస్‌ ఛాయాగ్రణం అందిస్తున్నారు.

Tags:    

Similar News