US Election Results 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అమెరికాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ 270 స్థానాలతో భారీ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ 224 స్థానాలతో వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ స్పందించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడు తానే, అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనన్నారు. తన క్యాంపెయిన్ పార్ట్నర్ జేడి వాన్స్‌ను ఇకపై వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.