US Elections 2024 Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

US Elections 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2024-11-05 06:46 GMT

US Elections 2024 Live Updates in Telugu

US Elections 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 1845 లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారంగా నవంబర్ లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున పోలింగ్ జరుగుతుంది. 1789 లో జార్జ్ వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతమున్న జో బైడెన్ 46వ అధ్యక్షుడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్ బరిలో నిలిచారు. పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బైడెన్ కంటే ముందుగా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి మరోసారి ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముందస్తు ఓటింగ్ లో ఇప్పటికే 6 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే.. మరికొందరు ఈ మెయిల్స్ ద్వారా ఓటేశారు.

Live Updates
2024-11-05 07:57 GMT

EAM S Jaishankar about Donald Trump vs Kamala Harris in US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ వైస్ కమలా హారీస్ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది. అసలు ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తారు? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది అనే అంశంలో చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే కోణంలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకునే ఇమ్మిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు అమెరికాకు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుంటాయి. అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ ప్రభావం భారతీయులకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే రాబోయే ప్రెసిడెంట్ ఎవరైతే అమెరికా - భారత్ సంబంధాలు ఎలా ఉంటాయనే అంశంపై భారతీయులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Tags:    

Similar News