Us Elections 2024 Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ .. 23 రాష్ట్రాల్లో విజయం.. కమలా హారీస్ పరిస్థితి ఏంటి?
US Elections 2024 results: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 23 రాష్ట్రాల్లో జయకేతం ఎగురవేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రపం, మరో 7 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్ 13 రాష్ట్రాలో విజయం సాధించారు. మరో 5 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. 7 స్వింగ్ రాష్ట్రాలకు గాను ఆరింటిలోనూ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ రాష్ట్రాలు ప్రభావితం కానున్నాయి. పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందున్నారు. ట్రంప్ నుకు 52శాతం, కమలా హారిస్ కు 46.2 శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి.
ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో ట్రంప్, మరో 13 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయఢాంకా మోగిస్తున్నారు. మిస్సిసిపి, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా , ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఒహియో, వ్యోమింగ్,నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, ఒక్లహామా, లుసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, మోంటానా, కాన్సస్, ఒక్లాహామా, అయోవా, ఐడా హో రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్ మౌంట్, న్యూయార్స్, మస్సాచుసెట్స్, కన్నెటిక్టికట్, రోడ్ ఐలాండ్ లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ఇంతవరకు 393 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా..అందులో 214 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 179 ఎలక్ట్రోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారీస్ కు వచ్చాయి.