పాట అని తలుచుకోగానే మొదట మెదిలే పేరు ఆయనదే.. ముత్యాలు వస్తావా అని పాడి నవ్వించినా.. శంకరా నాదశరీరాపరా అని సంగీత సుస్వారలతో మైమరిపించినా.. నవ్వింది మల్లె చెండు అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టినా.. ఆ గాన గాంధర్వానికి మురిసిపోని హృదయం లేదు. ఒకటా రెండా 40 వేలకు పైగా పాటలు.. అదీ ఇదీ అని లేకుండా 11 భాషలు..అలుపనేది లేకుండా నాలుగు దశాబ్దాల సినీ గాత్ర ప్రస్థానం.. ప్రజల ఆరాధ్య గాయకుడిగా నిలిచిన తెలుగు తేజం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం! కొన్ని పాటలు ఆయన పాడితే బావుండును అనిపిస్తుంది.. మరికొన్ని అబ్బా ఈయన పాడాడేమిటి అనిపిస్తుంది..కానీ, బాలు పాడితే ఏ పాటైనా అయన కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఆయన గొంతు జాతీయస్థాయి సినీ నటులకు ఆలంబనగా నిలిచింది. ఆయన స్వరం ఎందరో ప్రసిద్ధ నటులకు గాత్రభిక్ష అందించింది. అంతెందుకు బాలూ పాడితే ఆయన గొంతులో నటుల గాత్రం ఒదిగిపోతుంది. తెలుగు సినిమా.. కాదు భారతీయ సినిమా ఉన్నంత వరకూ బాలసుబ్రహ్మణ్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. భారత సినీమా తల్లికి స్వరాభిషేకం చేసి.. పాడుతా తీయగా అంటూ మన మధ్యలోనే ఎప్పటికీ.. మన గుండెల్లోనే ఎన్నటికీ.. అయన స్థానం చెదరదు. ఎందుకంటే నభూతో.. నభవిష్యతి.. అనే మాటకి సరిగ్గా సరిపోయే పాటసారి మన బాలూ!దివికేగిన బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..