Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-05-31 00:52 GMT

ఈరోజు ఆదివారం, 31మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, నవమి (రాత్రి 09:27 వరకు), తదుపరి దశమి.సూర్యోదయం 5:44am, సూర్యాస్తమయం 6:22 pm


Live Updates
2020-05-31 16:56 GMT


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే వారికి బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు

పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున సహకరించాలి

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

పరీక్షల్లో నెగటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్

పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్

వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

2020-05-31 15:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీయస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.



 


2020-05-31 15:01 GMT

కృష్ణ జిల్లా విజయవాడలోని పటమటలో గ్యాంగ్ వార్ లో గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

శనివారం రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.



 


2020-05-31 14:52 GMT

బ్రేకింగ్ :-

కృష్ణాజిల్లా :- గన్నవరం లో కారు బీభత్సం

గన్నవరం సినిమాహాల్ సెంటర్ నాలుగు రోడ్డు ల కూడలి వద్ద కారు బీభత్సం.

ఒక సైకిల్ ని, ఒక టీవీఎస్ ని, యాక్టివా బైక్ ని ఢీ కొని డివైడర్ పైకి ఎక్కి పులదుకాణాన్ని ఢీ కొట్టి ఆగిన కారు.

కారు నడుపుతూ ఉన్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోయినట్లు స్థానికులు సమాచారం.

పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలింపు.

2020-05-31 14:51 GMT

బ్రేకింగ్ న్యూస్ :-

రాష్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మేనత్త అనారోగ్యం తో సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి. Kovid పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి కుటుంబసభ్యులకు Kovid పరీక్షలు చేశారు, ఫలితం రావాల్సి ఉంది.

2020-05-31 06:35 GMT

కృష్ణా జిల్లా 

గుడివాడ మందపాడు లో విషాదం.

మందపాడు పంపుల చెరువు లో పడి అన్నదమ్ములు హర్ష,(19) ప్రేమ్( 21) ప్రమాదవశాత్తూ మృతి.

ఓకే కుటుంబ లో ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మృతి చెందటం మందపాడులో విషాదం

2020-05-31 06:33 GMT

కామారెడ్డి జిల్లా

దోమకొండ గడి కోట కామినేని ఉమాపతిరావు అంతిమ యాత్ర లో తేనెటీగల దాడి..

మృతదేహాన్ని వదిలి లోపలికి వెళ్లిన బంధువులు, చిరంజీవి, రాంచరణ్

2020-05-31 06:33 GMT

కామారెడ్డి జిల్లా :

దోమకొండ గడికోటలో నిర్వహిస్తున్న కామినేని ఉమాపతి రావు

అంత్యక్రియలు.

హాజరైన కామినేని కుటుంబ సభ్యులు, సినీ నటుడు చిరంజీవి, కుమారుడు రాంచరణ్ , జిల్లా కలెక్టరు శరత్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పలువురు ప్రముఖులు.

కామినేని ఉమాపతి రావు భౌతిక కాయానికి పుష్ప గుచ్చము వేసి నివాళ్లు అర్పించిన ప్రముఖలు.

2020-05-31 02:20 GMT

-రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి శనివారం రాత్రి వెల్లడించారు.

-హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్‌కుమార్‌ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది.

-రమేశ్‌కుమార్‌ పునర్నియామకం చట్టవిరుద్ధమని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం అన్నారు.
 

-రమేశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టినట్లు ముందు ప్రకటించిన ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి.

-శుక్రవారం నాటి సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు శనివారం రాత్రి వెల్లడించారు.

-రమేశ్‌కుమార్ పునర్నియామకంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున సర్క్యులర్‌ని వెనక్కి తీసుకున్నట్లు కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు.

2020-05-31 02:10 GMT

-ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా జి.వాణీమోహన్‌.

-ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం

-ప్రస్తుతం ఆమె సహకారశాఖ కమిషనర్‌గా ఉన్నారు.

-ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డైరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

-ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌ ను నియమిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News