Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 25 మే, 2020 :
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా వార్తలు
- టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించిన ప్రభుత్వం
- మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం
- ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి కోరిన ప్రభుత్వం
- ఈ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేసిన ప్రభుత్వం
-ఈ రోజు తెలంగాణలో 66 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
-రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది.
-ఈ రోజు 72 మంది డిశ్చార్జి అయ్యారు.
-ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1164
-మృతుల సంఖ్య 56గా ఉంది.
*మంగళగిరి పట్టణంలో మద్యం మాఫియా పై పోలీసుల దాడులు.
*బాప్టిస్ట్ పేట లో అక్రమంగా తరలిస్తున్న 90 మద్యం బాటిల్స్ పట్టివేత.
*బాటిల్స్ స్వాధీనం.
*మహిళ అరెస్టు.
♦ ఎండ తీవ్రత కారణంగా బైక్ అదుపుతప్పి ఒకరు మృతి, ఒక్కరికి గాయాలు.
♦ చెవిటికల్లు గ్రామం నుండి కంచికచర్ల వస్తుండగా చెవిటికల్లు గ్రామ సమీపంలో ద్వీచక్ర వాహనం అదుపు తప్పి క్రింద పడిన ఘటనలో ఒకరు మృతి మరోకరికి గాయలు.
♦ గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు.
♦ చనిపోయిన వ్యక్తి చెవిటికల్లు గ్రామానికి చెందిన వెలగలేటి వీర కోటేశ్వరరావు(31) గా గుర్తింపు.
♦ చనిపోయిన వ్యక్తిని నందిగామ మార్చురీకి తరలింపు.
నిర్మల్ జిల్లా : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.
విలేకరుల సమావేశంలో మాజీ డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగపూర్ గ్రామ సమీపంలో ప్రమాదం.
కాంటేనర్ ను ఢీ కొన్న కారు.
ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం మెట్టపాలెం, కూండ్రం గ్రామాలలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ( SEB ) అధికారుల తనిఖీలు.
20 లీటర్ల నాటుసారా, 18 మద్యం సీసాలు పట్టివేత.
ఆరుగురు వ్యక్తులను అరెస్ట్. ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
➡️రెండు నెలల విరామం తర్వాత తిరిగి రాక
➡️మార్చి 22 నుంచి హైదరాబాదులోనే ఉన్న చంద్రబాబు
➡️ఉండవల్లిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు నెలల అనంతరం తిరిగి ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22న నుంచి హైదరాబాదు నుంచి ఈ ఉదయం విశాఖ వెళ్లాల్సిన చంద్రబాబు, విమానం రద్దవడంతో రోడ్డు మార్గంలో అమరావతి పయనమయ్యారు. ఆయనకు ఏపీలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. కరకట్టపై నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అభివాదం చేశారు.
తాడేపల్లి
చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం కార్యకర్తల ఎదురుచూపులు.
మళ్ళీ మీరే రావాలంటూ పలురికార్డల తో స్వాగతం పలకనున్న కార్యకర్తలు.
- ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దాటిన చంద్రబాబు
- గరికపాడు చెక్ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు
- అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీ చేసిన పోలీసులు
- మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు
- లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్లడే ఉండిపోయిన చంద్రబాబు
- లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఎపికి వచ్చిన చంద్రబాబు
- విశాఖపట్నం వెళ్లాల్సి ఉన్నా.. విమానాలు రద్దు కావడంతో పర్యటన వాయిదా
- రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి
- తాడేపల్లి లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు