Live Updates:ఈరోజు (జూన్-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 28 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి (రా.12:36 వరకు), ఉత్తర నక్షత్రం (ఉ.08:36వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
భక్తులకి టీటీడీ శుభవార్తను అందజేసింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. సోమవారం నుంచి ఈ టికెట్లు అందుబాటులో వస్తాయి. రోజుకు 9000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. అలాగే జూలై ఒకటవ తేది నుంచి రోజుకు 3,000 చొప్పున సర్వ దర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
వ్యక్తి దారుణ హత్య.. గుంటూరు జిల్లా , గురజాల మండలం , అంబాపురం గ్రామంలో విక్రమ్ అనే వ్యక్తిని శనివారం అర్ధరాత్రి నరికి చంపిన ప్రత్యర్థులు
- భైక్ పై వస్తున్న విక్రమ్ ని అంబాపురం చెరువు గట్టు వద్ద అడ్డగించి వెంటాడి చంపిన ప్రత్యర్థులు
- మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- పాత కక్షల నేపథ్యంలో నే హత్యకు గురైనట్లు స్థానికుల సమాచారం
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం..
- తాళ్ల పాలెం గ్రామం నుండి సింగవరం వెళ్లేదారిలో రోడ్డు పక్కన ఉన్న గడ్డివాములో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
- వయస్సు (సుమారు 40.. సం) కేసు నమోదు చేసి చేసి ధర్యాప్తు చేస్తున్న నిడదవోలు S I.ప్రసాద్, సిబ్బంది
తూర్పుగోదావరి: రాజోలు మండలం కడలిలో విషాదం...
- చంద్రగిరి ఉమామహేశ్వరరావు (38) తన భార్య, కుమార్తె అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరితనాన్ని భరించలేక మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య...
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్ళీ లాక్ డౌన్ విధించాలని సీఎం కేసీఆర్ కు అధికారుల రిపోర్ట్
మళ్ళీ లాక్ డౌన్ విధించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
- కరోనా దెబ్బకు వ్యాపారాలు, కంపెనీలు అన్ని ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో చాలా కుటుంబాలు సగం వేతనంతోనే జీవనం సాగిస్తున్నాయి.
- సరిగ్గా ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
- ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది.
- ఇప్పుడు టమాట కొనాలన్నా, తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది.
- ప్రస్తుతం పెరిగిన ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
- కరోనా పరిస్థితుల ఆధారంగా టమాట ధరలు పెరిగాయని తెలుస్తుంది.
- నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్ ఆదేశించారు.
- పర్యా వరణ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అధ్యక్షతన వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ 'హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గింపు' ప్రణాళికలపై శనివారం సమీక్ష నిర్వహించారు.
- ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నగరంలో వాహనాలకు బీఎస్–6 (భారత ప్రమాణాలు–6) అమలు, ట్రాఫిక్ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్‌లో అవి వెళ్లేలా 'లేన్ క్రమశిక్షణ'అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
- మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అని అన్నారు. విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనేనన్నారు.
- విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌లో గురుకుల పాఠశాలను ప్రారంభించారు.
- ఆయన పాఠశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు వచ్చారని అన్నారు.
గోవిందరావుపేట: మండలం దుంపిల్లగూడెం గ్రామ పంచాయతీలోని తాతయ్యపల్లికి చెందిన 25 నిరపేద కుటుంబాలకు ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో గత 95 రోజులుగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం తమ వంతు సాయం చేయడం జరుగుతుందని, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
- ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కొంపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య, పసర సర్పంచ్ ముద్దబోయిన రాము, ఎంపీటీసీ ఏడుకొండలు, ములుగు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బార్ల సమ్మి రెడ్డి, వార్డు సభ్యులు కొర్ర శ్రీనివాస్, చేరుకుల సురేష్, తండా రవి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కపిలేశ్వరపురం మండలంలో అత్యధికంగా 32.6 మి.మీ, అత్యల్పంగా మండపేట, పెద్దాపురం మండలాల్లో 1.2 మి.మీ వర్షపాతం నమోదయింది.
- కొత్తపేట మండలంలో 13.4 మి.మీ, కాకినాడ అర్బన్‌లో 13 మి.మీ, ఆలమూరు మండలంలో 11.8 మి.మీ, పిఠాపురం, గండేపల్లి మండలాల్లో 10.6 మి.మీ, సామర్లకోట మండలంలో 10 మి.మీ, కాట్రేనికోన మండలంలో 9.2 మి.మీ, పి.గన్నవరం మండలంలో 7.8 మి.మీ వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.