♦♦కృష్ణాజిల్లా : పామర్రు♦♦
- బెల్లం ఊట ధ్వంసం
- పామర్రు మండలం కురుమద్దాలి శివారు కొబ్బరి తోటలో 200 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
- ఎస్.ఐ గణేష్ కథనం ప్రకారం ఢ్జిల్లా ఎస్.పి రవీంద్ర బాబు ఆదేశాల మేరకు కార్ధన్ సెర్చ్ లో భాగంగా గుడివాడ ట్రైనీ డి.ఎస్.పి రమ్య ఆధ్వర్యంలో సి.ఐ కిషోర్ బాబు, ఎస్.ఐ గణేష్ లు తమ సిబ్బంది తో నాటుసారా తయారీ కేంద్రం మీద దాడి చేశారు. ఈదాడిలో 200లీటర్ల బెల్లం ఊట కనబడటంతో దానిని ధ్వంసం చేశారు.
@ తిరుమల
- శ్రీవారిసేవలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను
- కరోనా మహమ్మారి నుంచి మన దేశం విముక్తి పొందాలని శ్రీవారిని ప్రార్ధించాను
- సుందరకాండ పారాయణంలో పాల్గొని ఇదే కోరుకున్నాను
- ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనా పై బలంగా పోరాడుతున్నాం
- దేశ రక్షణ కోసం సరిహద్దులో చైనా పై మన సైనికులు గట్టి జవాబు ఇచ్చారు
- మన జవాన్లు చేస్తున్న పోరాటానికి మరింత శక్తిని చేకూర్చాలని శ్రీవారిని ప్రార్ధించాను
- ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పోరాటాలు అన్నిటిలో భారత్ విజయం సాధించనుంది
>>> కడప జిల్లా:
- ఎర్రగుంట్ల మండలం వై. కోడూరు వద్ద గూడ్స్ రైలు ప్రమాదం
- రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై ఆగిపోయిన కారును డీ కోన్న గూడ్స్ ఇంజన్.
- ఆగిన క్షణాల్లోనే డీకోట్టిన గూడ్స్..
- ఒకరు మృతి.. మరోకరికి గాయాలు..
- పరిస్థితి విషమం.. ప్రోద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
- మృతుడు వై కోడూరు కు చెందిన నాగిరెడ్డిగా గుర్తింపు..
- భారతీ సిమెంట్ లో వాగిన్లను వదిలి వస్తుండగా ప్రమాదం..
>> కర్నూలు
- శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు
- శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
- శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ జేడీ గంగాధర్ రావు ఆధ్యర్యంలో ఐదుగురు సభ్యుల బృందం..
- క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు.
- శుక్రవారం అర్ధరాత్రి దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది.
- విరాళాల కేంద్రానికి ఆకస్మికంగా చేరుకుని తనిఖీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ లేఖ..
- తెలంగాణ సీఎం కేసిఆర్ కు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు.
-తెలుగుతేజం అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
- దేశసేవలో ప్రాణాలర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు.
- ఈ మేరకు వైస్ అడ్మిరల్ రెండు పేజీల లేఖను రాశారు.
కోవిడ్ రిలీఫ్ కిట్లు పంపిణీ
పొన్నూరు: నేటి సమాజంలో మానవులకు ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ జబ్బును ఎదుర్కొని జీవించడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ డి.పద్మనాభుడు అన్నారు.
- శుక్రవారం మండలపరిధిలోని నండూరు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో సేవాభారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 రిలీఫ్ కిట్లను పంపిణీ చేశారు.
- సేవా భారత్ వారు ప్రస్తుత పరిస్థితిలో అందిస్తున్న సేవలు స్ఫూర్తి దాయకమని తహశీల్దార్ కొనియాడారు.
- ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ... సేవా భారత్ స్వచ్ఛంద సంస్థ గ్రామములో నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
- మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం తరఫున తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
- అలానే మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.
- అనంతరం గ్రామములోని నిరుపేదలైన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
- ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
జేసీబీ, ట్రాక్టర్‌లో మృతదేహలు తరలింపు.. జగన్ సర్కార్ తీరుపై చంద్రబాబు ఆగ్రహం..
- రోనా చేటుకాలంలో మానవ సంబంధాలన్నీ మంటకలిసిపోయాయి.
- మరణిచిన వ్యక్తిని నలుగురు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి దాపురించింది.
- ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది.
- కాశీబుగ్గ పురపాలక సంఘంలో కరోనా వైరస్ లక్షణాలతో వ్యక్తి మరణించాడు.
- అతని మృతదేహాన్ని తరలించేందుకు వాహనదారులెవరూ ముందుకు రాలేదు.
అక్రమ మద్యం సీజ్.. ఇద్దరి అరెస్ట్
మంగళగిరి: తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 120 మాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- శుక్రవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంగళగిరి మండలంలోని కాజా ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీలో
వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
- 120 మద్యం సీసాలతో పాటు పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామానికి చెందిన ఇద్దరూ వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
నేరాల నియంత్రణకు దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాట్లు
సిద్ధవటం: మండలం భాకరాపేట గ్రామానికి చెందిన వ్యాపారస్తుల సహకారంతో ప్రధాన హైవే రోడ్డు లోని ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.
- భాకరాపేట ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్న ఈ సిసి కెమెరాల వల్ల కొంతవరకు నేరాలు నియంత్రించవచ్చన్నారు.
- ఎందుకంటే నేరాలు ప్రమాదాలు జరిగినప్పుడు ముద్దాయిలు వాహనాలు తప్పించుకు పోతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంవల్ల ఆధారాలు సేకరించి తప్పించుకొని పోయిన వాహనాలను ముద్దాయిలను పట్టుకొని కేసులు నమోదుచేసి, చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో కొంతవరకు నేరాల నియంత్రణ అదుపులోనికి వస్తుందని ఆయన తెలిపారు.
చిరుత పులులు సంచారం.. భయాందోళనలో గ్రామ ప్రజలు
వజ్రకరూరు : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం గ్రామ కొండలో రెండు చిరుత పులిలు సంచరిస్తూ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
- ఎప్పుడు చిరుతలు బయటకు వచ్చి మనుషుల మీద, పశువులు, గొర్రెలపై పడి చంపుతున్నాయని భయపడుతున్నారు.
- గూళ్యపాళ్యం గ్రామ కొండలో శుక్రవారం మధ్యాహ్నం చిరుతలు కనబడడంతో భయాందోళనలో గూళ్యపాళ్యం గ్రామ ప్రజలు.
- ఎప్పుడు కొండ నుంచి కిందకి దిగివచ్చి దాడి చేస్తుందో అని భయపడుతున్నారు.