Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 22 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పాడ్యమి (ఉ.11:58 వరకు), ఆరుద్ర నక్షత్రం (మ.01:31వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
- ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.
- నాలుగువందల కు పైగా కేసులు నమోదు అయ్యాయి.
- గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,704 శాంపిల్స్ ను పరీక్షించగా 443 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.
- రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9372 కు చేరింది. మరణాల సంఖ్య 111 కు చేరింది.
- ఇక ఆదివారం మరో 83 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
» చిత్తూరులో 21 నాటు తుపాకులు స్వాధీనం
చిత్తూరు జిల్లాలో నాటు తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లె మండలంలో పోలీసులు నాటుతుపాకులను గుర్తించారు. కోళ్ల బైలు, మాలెపాడులో మదనపల్లె రూరల్ పోలీసులు 21 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది
విజయవాడ సెంట్రల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కరోనా లక్షణాల తో మృతి.
- రెండు రోజులుగా ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న అభ్యర్థి.
- ఆయాసంతో ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు కరోనా పరీక్షలు.
- పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి.
- ఆయన మృతితో ఆయన డివిజన్ లో ప్రజలు భయాందోళన.
- ఎన్నికల నేపథ్యంలో డివిజన్ లో కూరగాయలు, చీరలు, రంజాన్ తోఫా అందించిన కార్పొరేటర్ అభ్యర్థి.
- డౌనూరు పంచాయతీలోని రెల్లలపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ,వాటర్ అందుబాటులోకి రావడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
- ఈ మేరకు గ్రామస్థులంతా వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
- పంచాయతీలోని పంచాయితీ కార్యదర్శి లేకపోవడంతో మూల పేట కు చెందిన పంచాయతీ కార్యదర్శిని ఇన్చార్జిగా వేశారని సమస్యను ఆమె దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.
- వాటర్ ట్యాంక్ లోని త్రాగునీరు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
- ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి గారికి గాని, సచివాలయ సిబ్బందికి గాని చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదంటూ తెలిపారు.
- ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఒకటే కాదని,ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నట్లు సురేష్ పట్నాయక్ మరియు గ్రామస్తులు తెలిపారు.
- కరోనాపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
- ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలు, టెస్టులు తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నారు.
- ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.
- నేటి నుండి కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
- ఉదయం 06.00 గంటలకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.
- ఈ సర్వీసుకు రిజర్వేషన్ సౌకర్యం వుంటున్నదన్నారు.
- సౌకర్యం ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
- కడప జిల్లాలో కరోనా మహమ్మారి కలవరపాటుకు గురి చేస్తోంది.
- పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
- కొమ్మన వారి పల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
- ఇటీవల తాడిపత్రిలో వివాహానికి డిజిటల్ అసిస్టెంట్ హాజరైనట్లు తెలుస్తోంది.
- డిజిటల్ అసిస్టెంట్ తమ్ముడికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.
- వీరిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు.
- అప్రమత్తమైన అధికారులు పుల్లంపేటను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
- తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు.
- గాల్వన్ ఘటనలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
- ఈరోజు మధాహ్నం 3 గంటల సమయంలో సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం 5 కోట్ల రూపాయల చెక్ ను అందించనున్నారు.
- సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు షేక్ పేటలో 500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నారు.
- ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కా వేసుకొని వచ్చిన చంద్రబాబు, గవర్నర్ ప్రసంగం మధ్యలో వెళ్లి, తరువాత అసెంబ్లీ కి రాలేదు.
- చంద్రబాబు ప్రజా సమస్యలపై కాకుండా అవినీతి పరులను అరెస్టు చేశారని రాకపోవడం సిగ్గుచేటు.
- చంద్రబాబే అవినీతి పరులను బయట పెట్టామని చివరకు ఇలా అసెంబ్లీకి రాకపోవడం ఏమిటని ఎద్దేవా చేశారు.
బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 22) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.