Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-17 00:31 GMT
Live Updates - Page 4
2020-06-17 05:07 GMT

సీపీ సైబరాబాద్..

కల్నల్ కుటుంబ సభ్యులని ననల్ నగర్ ఆర్మీ గెస్ట్ హౌస్ కి తరలింపు...

కల్నల్ అంత్యక్రియలు రేపు జరుగుతాయి...

4 గంటలకి హాకింపెట్ ఎయిర్పోర్టు కి కల్నల్ పార్ధీవదేహం..

హకీమ్ పెట్ ఎయిర్పోర్ట్ లో గౌరవ వందనం..

అనంతరం సూర్యాపేట కు తరలింపు...

2020-06-17 04:15 GMT

ఏపీ లో 18 నుంచి ఆరో విడత రేషన్ పంపిణీ చర్యలు

విశాఖ జిల్లాలో ఆరో విడత ఉచిత పంపిణీ ఈనెల 18 తేదీ నుంచి 26వ తేదీ వరకు చేస్తారని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్షించారు.

ప్రతి రేషన్ కార్డు పై ఒక కిలో శనగలు, మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారని, అలాగే రూ.10కి అరకిలో పంచదార అందిస్తామన్నారు. రేషన్ డిపోల వద్ద రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

2020-06-17 04:13 GMT

తూ.గో.జిల్లా. సఖినేటిపల్లి మండలం గొందిలో వంగల నాగలలిత (20) ఏళ్ల మహిళ అదృశ్యం.

- సఖినేటిపల్లి పి.ఎస్ లో పిర్యాదు చేసిన తల్లిదండ్రులు.

2020-06-17 04:13 GMT

అక్రమ మద్యం స్వాధీనం

తూ.గో.జిల్లా. మలికిపురం (మం) గూడపల్లిలో అక్రమ మద్యం అమ్ముతున్న కటికిరెడ్డి రమేష్ ను అరెస్ట్ చేసి అతని వద్దనుండి 27 మద్యం బాటిల్స్ స్వాధీనం.

2020-06-17 01:44 GMT

భారత చైనా సరిహద్దుల్లో ఘర్షణలు

- 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు వార్తలు

- 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని జాతీయ మీడియా కథనాలు                                         - మరిన్ని వివరాలు 

2020-06-17 01:42 GMT

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

- అయ్యన్న తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

- ఆమె ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు దిశ చట్టాన్ని కూడా నమోదు చేసినట్టు సమాచారం.

- అదేవిధంగా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.

- మాజీ మంత్రిపై దిశ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కాగా, అయ్యన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.



Tags:    

Similar News