Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 16 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( పూర్తిగా), అశ్వనీ నక్షత్రం (పూర్తిగా) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm
ఈరోజు తాజా వార్తలు
విశాఖ : అయ్యన్నపాత్రుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి
తూ.గో..పిఠాపురం కోటగుమ్మం సెంటర్ లో 59సం. వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై కుప్పకూలి మృతి.
- పోలీసులకు సమాచారం..ఇందిరానగర్ కి చెందిన ప్రసాద్ గా గుర్తింపు...
- పాయకరావుపేట మండలం రాజవరం వి.ఆర్.ఓ రామకృష్ణ ఏసీబీ ట్రాప్
- రాజవరం రైతు పాస్ చేయటకు14000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.
- తుని గొల్లఅప్పారావు సెంటర్ లో మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.
- పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ
- కోత్త పుంతలు తొక్కుతున్న అక్రమ మద్యం వ్యాపారం..
- అంబులెన్స్ లోని మార్చూరీ బాక్స్ లో అక్రమంగా తరలిస్తున్న 107 లీటరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు, స్పెషల్ - ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు...
- తెలంగాణ నుండి ఆంధ్రా ప్రాంతానికి వస్తున్నట్లు పక్కా సమాచారం తో పట్టుకున్న పోలీసులు.....
- వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ వద్ద వెనక ఎస్కార్ట్ గా వస్తున్న ఒక కారు తో సహా అంబులెన్స్ ను పట్టుకొని అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఐదుగురు పై కేసు నమోదు చేసిన పోలీసులు
- అధికారులు నిఘా ఏర్పాటు చేసి ఎన్ని మద్యం బాటిళ్లు పెట్టుకుంటున్నా సరే ఆగని అక్రమార్కులు అక్రమ దందా
♦కృష్ణా జిల్లా♦
- జి.కొండూరు మండలం కందులపాడు లో, ప్రభుత్వ మద్యం దుకాణం లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట అక్రమంగా 392 మద్యం బాటిల్స్ తరలిస్తుండగా..
- పట్టుకున్న జి.కొండూరు ఎస్సై పి.రాంబాబు
♦గుంటూరు ః...
- మాజీమంత్రి నక్కా ఆనంద బాబు
- గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట.
- మంత్రి వర్గం చెప్పే అబద్ధాలు గవర్నర్ తో వల్లె వేయించారు
- ఎన్నికల హామీలు అన్నీ 90 శాతం అమలు చేసినట్లు గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు
- ప్రసంగంలోని అంశాలు చదివితే ఈ విషయం స్పష్టం అవుతుంది
- అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా... సరైన జాగ్రత్తలు తీసుకుని నిర్వహించలేరా
- కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ప్రభుత్వం ఏం చేసింది
- కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలు మినహా ప్రజలకు సాయం చేయలేదు
- ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటానికి చెరపడానికి 2 వేల 300కోట్లు ఖర్చు చేశారు
- ఇసుక మాఫియా, మద్యం మాఫియా పెరిగిపోయింది
- వాటిని పక్కదారి పుట్టించేందుకు టిడిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు
♦గుంటూరు ః
- మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- గతేడాది గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు
- దీనికి వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- హామీలను నెరవేర్చలేనప్పుడు ఆ ప్రసంగానికి విలువ ఉండదు
- రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెరిగాయి
- టెర్రరిస్టుల మాదిరిగా టిడిపి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు
- ప్రజలు 151 సీట్ల ఇచ్చింది రాజకీయ కక్ష్య సాధింపుల కోసమా..?
- అచ్చన్నాయుడు అరెస్టు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది
- శస్త్ర చికిత్స జరిగిన వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వస్తారా..?
- అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసిపి ప్రభుత్వం గుర్తించాలి
- మీకు అలవాటైన అవినీతిని మా పార్టీ నేతలకు అంటగడతారా
- జేసీ కుటుంబం దశాబ్దాలుగా రవాణా రంగంలో ఉన్నారు
- విచారణ లేకుండా అరెస్టు చేయటం రాజకీయ వేధింపులు కాక మరేంటి
- చింతమనేని ప్రభాకర్ ను కూడా కేసుల పేరుతో వేధిస్తున్నారు
- మీరు ప్రతిపక్షంలోకి వచ్చాక ఇవన్నీ మళ్లీ గుర్తుకు వస్తాయి
- ఇది ట్రయల్స్ అని మంత్రులు వ్యాఖ్యానించటం సిగ్గుచేటు....
- చిత్తూరు జిల్లా కుప్పం
- వసనాడు శక్తి స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలుడు
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
♦ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ....
- సామినేని ఉదయభాను ప్రభుత్వ విప్ చిట్ చాట్..
- టీడీపీ ఈరోజు సభలో ద్వంద్వ విధానాన్ని అవలంబించింది..
- టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది..
- అసెంబ్లీలో వా కౌట్ చేసిన టీడీపీ కౌన్సిల్ లో నిరసన చేపట్టింది..
- గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈ రోజు జరిగింది ఉమ్మడి సమావేశం..
- టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలి లేదంటే నిరసన చేపట్టాలి..
♦తెలంగాణ♦
- ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ప్రారంభమైన మంత్రులు,జిల్లాకలెక్టర్లతో సిఎం కేసీఆర్ సమావేశo
- కరోనా వైరస్ నేపథ్యంలోకేవలం మంత్రులు,జిల్లా కలెక్టర్లు,అడిషన్ కలెక్టర్లు మినహ మరేవ్వరిని అనుమతించని అధికారులు