Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-15 00:45 GMT
Live Updates - Page 3
2020-06-15 09:48 GMT

అమరావతి: ఏపి లో శాసన మండలి స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్

- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జులై 6 న ఎన్నిక.

- డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా తో ఎన్నిక.

- జూన్ 18 న నోటిఫికేషన్, 25 వరకు నామినేషన్లు.

- జులై 6 న పోలింగ్, అదే రోజు ఎన్నిక ఫలితం.

2020-06-15 08:30 GMT

- కృష్ణాజిల్లా: చాట్రాయి మండలం సూరంపాలెం వద్ద తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా రెండు ద్విచక్ర వాహనాల పై మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన ఎస్సై కే.శివన్నారాయణ

- వారి వద్ద నుండి 35 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని,రెండు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

2020-06-15 06:52 GMT

* తూ:గో సామర్లకోట పట్టణ పరిధిలో ఉన్న బచ్చు పౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ సమీపంలలో ఉన్న అయోధ్యరాంపురంలో రాత్రి సుమారు 10 గంటల సమయంలో పేరిమల్ల దుర్గాప్రసాద్ వయస్సు 35 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు చిన్నారులు ఉన్నారు సొంత ఊరు భద్రాచలం దగ్గర మణుగూరు గత ఏడాది నుండి సామర్లకోట లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు .ఆత్మహత్యకు గలా కారణాలు తెలియరాలేదు.అని ఎస్సై సుమంత్ తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అన్నారు.

2020-06-15 06:47 GMT

- ఉయ్యూరు లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు

- శ్రీనివాస కలాసాల సమీపం లో అవంతిక అపారట్మెంట్స్ లో నివాసముండే 32 సంవత్సరాల అవివాహిత యువతి కి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ..

- ఈ యువతి విజయవాడ రమేష్ హాస్పిటల్ లో పనిచేస్తున్నట్లు సమాచారం

2020-06-15 06:25 GMT

- నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కీ॥శే రుత్తల లత్సాపాత్రుడు చిత్ర పటం తొలగించడంతో ఆందోళన.

- పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న

2020-06-15 05:39 GMT

విద్యుత్ బిల్లు పై ధర్నా కు వెళుతున్న బిజెపి గ్రేటర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు ను ఆయన నివాసం తార్నాకలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

-హౌస్ అరెస్టు చేయడం పై ఖండణ.

-లాక్ డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు.

-మూడు నెలల కాలానికి బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. 

2020-06-15 04:34 GMT

కాణిపాకం ఆలయం మూసివేత

- కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో కరోనా కలకలం 

- ఆలయంలో పనిచేస్తున్న హోగార్డు కు కరోనా పాజిటివ్ 

- ఆలయం మూసివేసిన అధికారులు 



2020-06-15 01:32 GMT

విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిలో కోవిడ్‌ టెస్టులు..

♦దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు..

♦ రోజుకు 50 మంది చొప్పున పరీక్షలు..


2020-06-15 01:31 GMT

నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీజేపీ పిలుపు..

♦విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్‌..

♦ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సౌధ ఎదుట నిరసన..




Tags:    

Similar News