Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 13 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అష్టమి (రాత్రి 11:58 వరకు), పూర్వాభాద్ర నక్షత్రం (రాత్రి 09.27 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm
ఈరోజు తాజా వార్తలు
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కామెంట్స్..
అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గం..
శాస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని ఇంత అమానుషంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది..
కక్ష కార్పున్యాలతో నడుస్తున్న ప్రభుత్వం ఇది..
ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆవేదన ప్రజల్లో మొదలయ్యింది..
ఏడాది కాలం ప్రతిపక్షాలను వేధించడానికే ఉపయోగించారు..
గ్రామాల్లో ముఠా తగాదాలు మాదిరిగా రాష్ట్రాన్ని తయారు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు..
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాట్లేదు..
భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి కనబడట్లేదు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిని కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు..
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అన్యాయంగా కేసుల పేరుతో వేధిస్తున్నారు..
కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల అభివృద్ధి లో భాగంగా ఆక్సిజన్ పార్క్ ను సందర్శించిన సిఎస్.
కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్,
మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, PccF ఆర్. శోభ ఇతర అధికారులు.
కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ లో అటవీ శాఖ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించిన సీఎస్.
సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాల పరిశీలన.
అటవీ పునరుజ్జీవన పనులను ప్రత్యక్షంగా చూసిన సీఎస్.
విశాఖ లో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు..
సినిమా స్థాయి లో మలుపులు తిరుగుతున్న పరిస్థితి...
ఈ కేసులో మరో ఇద్దరి అరెస్టు
దివ్య భర్త వీరబాబు, బాబాయి కృష్ణ ను అరెస్టు చేసిన పోలీసులు
దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో వీరిపై కేసు
బాబాయి కృష్ణ బ్యాంక్ అకౌంట్ లో రూ. లక్ష వేసిన దివ్య
దఫ దఫాలుగా కృష్ణ కు డబ్బులు పంపించిన దివ్య
2018 డిసెంబర్ లో వీరబాబుతో దివ్యకు వివాహం
దివ్య పిన్ని కాంతవేణితో సహజీవనం చేస్తున్న కృష్ణ
మేనల్లుడు వీరబాబుతో దివ్యకు వివాహం చేయించిన కృష్ణ
వైద్య పరీక్షల కోసం నిందితులను కేజీహెచ్ కు తరలించిన పోలీసులు
వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు
TS High Court:-
ఈనెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు
ఈనెలాఖరు వరకు జిల్లాల్లో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయం
రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని పునస్సమీక్షించిన హైకోర్టు
అనంతపురం
జడ్జి ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ని హాజరు పరిచిన పోలీసులు.
జేసీకి 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి.
రెడ్డిపల్లి సెంట్రల్ జైలకు తరలించిన పోలీసులు.
గుంటూరు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ కు అనుమతి నిరాకరణ.
-అచ్చెన్నాయుడు ని పరామర్శించేందుకు అనుమతి కోరిన చంద్రబాబు.
-కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేము అన్న జైళ్లశాఖ అధికారులు.
-గత రెండు వారాలుగా ఎవరికి అనుమతి ఇవ్వలేదన్న అధికారులు.
-చంద్రబాబు వినతిపై జి జి హెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందన.
-మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలన్న జి జి హెచ్ సూపరింటెండెంట్.
ఏపీ లో తాజా గా 222 పొజిటివ్ కేసులతో 5858 కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
వీరిలో చికిత్స పొందుతున్న వారు 1865
గడిచిన 24 గంటల్క్ పరీక్షించిన 11775 శాంపిల్స్ లో 186 మందికి పొజిటివ్ లక్షణాలు బయటపడగా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవాళ్ళు 33, ఇతర దేశాలనుంచి వచ్చిన వాళ్ళు 3
రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు
ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్.బాలసుబ్రమణ్యం
రోడ్ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్ త్రిపాఠి ఉజాలా
ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్.డి.రామకృష్ణ
గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
డీజీపీ ఆఫీస్ అడ్మిన్ ఏఐజీగా బి.ఉదయ్ భాస్కర్
విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్.రంగారెడ్డికి ఆదేశాలు
ఎస్‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ
విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు
విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్.విజయరావు
ప.గో. జిల్లా ఎస్పీగా నారాయణనాయక్
సీఐడీ ఎస్పీగా నవదీప్‌సింగ్ గ్రేవాల్
గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్ గున్నీ
ఎం.దీపికకు డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
దిశ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికకు ఆరో పటాలం కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు
- ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరమసించనున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
- కాసేపట్లో అమరావతికి బయల్దేరనున్నా చంద్రబాబు నాయుడు
- గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నా అచ్చెన్నాయుడు ను పరామర్శించనున్న చంద్రబాబు నాయుడు.
- జైలు సూపరింటెండెంట్, జైళ్ల శాఖ డీజీని అచ్చెన్నాయుడు పరామర్శ కోసం అనుమతి కోరిన చంద్రబాబు నాయుడు
కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
నిన్న కలపర్రు టోల్ గేట్ వద్ద విజయవాడ వెళ్తున్న చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు..
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 8మంది పై కేసు..
సెక్షన్ 143,353,341,189,289,270,149 ఐపీసి క్రింద కేసు నమోదు...