Live Updates:ఈరోజు (జూన్-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 11 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, షష్ఠి(రాత్రి 09:10 వరకు), ధనిష్ఠ నక్షత్రం (మధ్యాహ్నం 04.35 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm
ఈరోజు తాజా వార్తలు
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
- ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ రేపు మధ్యాహ్నం 12.30గంటల తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది.
- మార్చి 4 నుంచి 23 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరిగాయి
- వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం.
- వచ్చే ఆగస్టు 12న పధకం ప్రారంభించనున్న సీఎం జగన్.
- రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చ
- విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డ కెబినెట్.
- కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్ నిర్ణయం.
- ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం.
- మొదటి దశలో 4736 కోట్ల వ్యయంతో నిర్మాణం.
- రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచన.
- రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశం.
- 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
- డిస్కమ్, ట్రాన్స్కో లకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం
- 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు కేబినెట్ ఆమోదం
తూర్పుగోదావరి జిల్లా...
-ఐ. పోలవరం మండలం బైరవపాలెం లో పడవల పై రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆయల్ ను పటుకొన్న ఐ.పోలవరం పోలీసులు...
తూర్పుగోదావరి జిల్లా... ప్రత్తిపాడు నియోజకవర్గం
-రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో అర్ధరాత్రి రాడ్ తో అత్త నూకరత్నం పై అల్లుడు ఏసుబాబు దాడి..
-మృతి చెందిన అత్త..ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు