కృష్ణాజిల్లా :-బాపులపాడు మండలం రంగన్నగూడెం లో అగ్నిప్రమాదంలో హోటల్ దగ్దం. పేలుతున్న గ్యాస్ సిలిండర్ లు...భయాందోళనలో స్థానికులు.
-కొల్లిపర సుబ్బారావు కు చెందిన ఇల్లు, హోటల్ గ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదం లో .5లక్షలు రూ ఆస్తి నష్టం.
-లాక్ డౌన్ కారణంగా 3నెలలుగా హోటల్ మూసివేశారు.
-ఇంట్లో అల్పాహారం తయారుచేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
-3 గ్యాస్ సిలిండర్ లు పేలిపోయాయి.
విశాఖ జిల్లా : పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీలో ఏసీబీ దాడులు.
-యూడీసీ శోభారాణి రూ. 19 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
విశాఖ జిల్లా, పెదబయలు మండలం చుట్టు మెట్ట వద్ద ఎక్సైజ్ అధికారులతనిఖీలు.
-వ్యాన్ తరలిస్తున్న వేయి (టన్ను) కిలోల గంజాయి పట్టివేత.
-వేన్ స్వాధీనం. ఇద్దరు వ్యక్తులు అరెస్టు.
కామారెడ్డి జిల్లా : మాచారెడ్డీ మండలం ఇసాయిపేట్ గ్రామంలో చిరుత పులి హల్ చల్.
-ఇసాయిపేట్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల గుంపుపై దాడి .
-ఘటనలో కొన్ని మేకలకు గాయాలు.. మరో మేక మృతి.
-సంఘటనతో భయందోళనకు గురవుతున్న గ్రామస్తులు.
చింతలపూడిలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్
పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ నుండి ఉంగుటూరు, నూజివీడు, ఏలూరు తదితర ప్రాంతాలకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 9 మంది వ్యక్తులను చింతలపూడి సిఐ పి.రాజేష్, ఎస్ఐ కెసిహెచ్ స్వామి, వారి సిబ్బంది అదుపులోకి తీసుకుని ఒక కారు, ఐదు ద్విచక్ర వాహనములు, 70 మద్యం సీసాలు, రెండు వేల రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తూ. గో.జిల్లా.. సామర్లకోట లో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 78 రోజుల తరువాత తెరుచుకున్న శ్రీ కుమార రామ భీమేస్వరస్వామి ఆలయం....
శివుని దర్శనం కోసం తరలి వస్తున్న భక్తులు..
స్క్రీనింగ్ టెస్ట్ ,హాండ్స్ శానిటేషన్ తో పాటు ఆధార్ కార్డ్ నమోదు తో దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు...
శ్రీవారి దర్శన భాగ్యం ఈరోజు నుంచి!
- నేటి నుంచి మూడు రోజుల ట్రయల్ రన్
- 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతి
- అన్ని రకాల ఏర్పాట్లు చేసిన టీటీడీ
- వృద్ధులకు, పిల్లలకు మాత్రం లభించని అనుమతి
- రోజుకు 6 వేల మందికే వెంకన్న దర్శనం
తెలంగాణాలో పది పరీక్షలు రాద్దవుతాయా?
- కరోనా తాజా పరిస్థితులపై ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం
- ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఈరోజు నుంచి తెరచుకోనున్న నేపధ్యంలో సమీక్ష
- మధ్యాహనం 2 గంటలకు విద్యశాఖపై సమీక్ష
- పదోతరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని వస్తున్న ప్రతిపాదనలపై సమీక్ష
- పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే అవకాశాలపై సమీక్ష
- కరోనా నియంత్రణ లాక్ డౌన్ అంశాలపై సాయంత్రం 4.30 గంటలకు సమీక్ష