Live Updates:ఈరోజు (జూన్-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-07 01:09 GMT
Live Updates - Page 2
2020-06-07 07:45 GMT

నిమ్స్‌లో ఓపీ బంద్‌!

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కబలిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మిన్నంటుతున్నాయి. దీంతో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇక మరో వైపు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఓపీ, రోగుల అడ్మిషన్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.


                                                         - పూర్తి వివరాలు

 



2020-06-07 07:38 GMT

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ ఫైర్.. తృటిలో తప్పిన ప్రమాదం...

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చేతిలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. కానిస్టేబుల్‌ శంకర్‌గౌడ్‌ తుపాకీని శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


                                                                             - పూర్తి వివరాలు

 


2020-06-07 06:26 GMT

హుస్సేనీఆలం ఎస్‌బీఐ బ్యాంకు మూసివేత

కరోనా మహమ్మారి కారణంగా మూసాబౌలీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో పంజేషా యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రానా తబస్సుం బ్యాంకు సిబ్బందిని అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.


                                                                 - పూర్తి వివరాలు

 

                              

2020-06-07 01:54 GMT

కరోనా కేసుల్లో ఐదో స్థానంలో ఇండియా

ఇండియాలో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది.

- శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త 9,887 కేసులు నమోదు అయ్యాయి.

- కరోనాకు కేంద్రంగా పేరు తెచ్చుకున్న స్పెయిన్ ను ఇండియా అధిగమించింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి.

- స్పెయిన్ లో 2,40,978 కేసులుండగా, ఇండియాలో కేసుల సంఖ్య 2.44 లక్షలను దాటింది..

- ఇదే సమయంలో రికవరీ రేటు 48.27 శాతం నుంచి 48.20 శాతానికి తగ్గింది.

- గడచిన 24 గంటల్లో 294 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరింది. 

Tags:    

Similar News