Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-05 00:43 GMT
Live Updates - Page 3
2020-06-05 04:11 GMT

- భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

- వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు నమోదు కాగా, 273 మంది ప్రాణాలు విడిచారు.

- ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


2020-06-05 03:19 GMT

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అంగన్వాడీలు.. ఏడాదికి 1,862 కోట్ల ఖర్చుకు వ్యయం

ఏపీ ప్రభుత్వం తాజాగా ఇదే విధానంలో అంగన్వాడీల్లో మౌలిక వసతులు పెంచేందుకు ఏర్పాట్లు చేసేందుకు సంకల్పించింది. దీనికి గాను ఏటా రూ. 1,862 కోట్ల వ్యయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనిపై సీఎం జగన్మోహనరెడ్డి మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


                                                                                     - పూర్తి వివరాలు



2020-06-05 02:39 GMT

- కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్

- నాలుగు లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

- ఇందులో 4112 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3377 మంది,

- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది ఉన్నారు.

2020-06-05 02:16 GMT

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ..

►పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

2020-06-05 02:15 GMT

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఘటనపై నేడు హైపవర్ కమిటీ విచారణ..

2020-06-05 02:15 GMT

వ్యర్థాల నిర్వహణకు ఆన్‌లైన్‌ వేదిక..

►నేడు ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌..

►పోస్టర్‌ను ఆవిష్కరించనున్న సీఎం జగన్‌..

2020-06-05 01:59 GMT

* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యాగమ శివారులో గల పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం.

*అలస్యంగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.

* పెద్ద మొత్తంలో లో ఆస్తి నష్టం..

2020-06-05 01:58 GMT

నిర్మల్ జిల్లా: సారంగాపూర్ మండలం కంకెట గ్రామంలో రెండు రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు పర్యటన.

* రైతులతో మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో పలువురు వైరల్.

* వారిపై చర్యలు తీసుకోవాలంటూ సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో తహసీల్దార్ తుకారాం ఫిర్యాదు.

2020-06-05 01:02 GMT

తెలంగాణాలో ఆగని కరోనా ఉధృతి

- గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మరణించారు.

- రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 105కి పెరిగింది.

- మరో 127 మందికి కరోనా నిర్ధారణ.

- జీహెచ్ఎంసీలో 110 మందికి కరోనా పాజిటివ్

2020-06-05 01:00 GMT

విస్తరిస్తున్న రుతుపవనాలు

- మరో మూడు రోజుల్లో అల్పపీడనం

- ఇప్పటికే కేరళకు ప్రవేశించిన నైరుతి రుతువపనాలు మరో నాలుగైదు రోజుల్లో ఏపీలో ప్రవేశించే అవకాశం

- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

- దీని ప్రభావంతో 9, 10 తేదీల్లో రాయలసీమ, కోస్తాలోకి నైరుతి రుతుపవనాలు

- వాతావరణ శాఖ  

Tags:    

Similar News