Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-03 00:46 GMT
Live Updates - Page 2
2020-06-03 10:00 GMT

కనీస సౌకర్యాలు లేక పాయకరావుపేట బస్టాండ్​లో అవస్థలు

పాయకరావుపేట: ఆర్టీసీ బస్టాండ్​లో బస్సు ఎక్కాలంటే ఊపిరి బిగపట్టాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు నిత్యం అధిక సంఖ్యలో... ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండులో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.



 


2020-06-03 09:58 GMT

ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ కాంప్లెక్స్​లు

విశాఖపట్నం: గ్రామీణ జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్​లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చోడవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్​లో... విశాఖ, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోలకు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఆయా డిపోలకు చెందిన బస్సు కండక్టర్లను చోడవరం కాంప్లెక్స్ లో ఉంచారు. వీరు ప్రయాణికులకు టిక్కెట్లును అమ్ముతున్నారు. రోజుకు 300 నుంచి 450 మంది వరకు ప్రయాణిస్తున్నారు.



 


2020-06-03 09:56 GMT

విశాఖకు చేరుకున్న గోదావరి ఎక్స్​ప్రెస్

విశాఖపట్నం: హైద్రాబాద్ నుంచి విశాఖకు గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులతో చేరుకుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులకు... రైల్వే స్టేషన్ లోపలే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి చేతికి హోమ్ క్వారంటైన్ ముద్ర వేసి పంపుతున్నారు. ప్రయాణికుల రైళ్లు వచ్చే ముందు... వాల్తేర్ రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వారు గేట్ నెంబర్- 1 ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు. అధికారులు బస్సులు, ప్రైవేట్ వాహనాలను రైల్వే స్టేషన్ గేట్ వెలుపలే ఏర్పాటు చేశారు. కేవలం బయటకు వచ్చే ప్రయాణికులు తప్ప మరెవ్వరూ ప్లాట్ ఫామ్​పై ఉండకుండా చర్యలు తీసుకున్నారు. విశాఖ నుంచి బయట ఊళ్లకు వెళ్లే వారికి జ్ఞానాపురం వైపు నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు.



 

 

2020-06-03 09:39 GMT

వ్యవసాయ కార్యాలయంపై కూలిన భారీ వృక్షం

జి.మాడుగుల: మండలంలోని వ్యవసాయ అనుబంధ కేంద్రమైన పీఎసీఎస్ కార్యాలయం షెడ్డు పై భారీ వృక్షం కూలిపోయింది. షెడ్డు పైకప్పు కూలిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం గోడలు, షెడ్డు కూలిపోయి భవంతి ప్రమాద భరితంగా మారడం వల్ల తమకు వేరే కార్యాలయం ఏర్పాటు చేయాలని సిబ్బంది విన్నవించారు. గతంలో ఇక్కడ రెవెన్యూ కార్యాలయం నిర్వహించగా, ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ సంస్థ పీఎసీఎస్ కార్యాలయం నిర్వహిస్తున్నారు.



 


2020-06-03 08:38 GMT

రాజమహేంద్రవరం:

-రాజమహేంద్రవరం లో ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.

-135 లీటర్ల నాటు సారా స్వాధీనం.

-400 లీటర్ల బెల్లపుఊట ధ్వంశం, ఒకఆటో సీజ్.

-ఐదుగురిపై కేసునమోదు.

2020-06-03 08:11 GMT

అమరావతి : రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన కోర్టు.

-రెండు పేజీల్లో తీర్పు ఇచ్చిన బెంచ్.

-రాష్ట్ర ప్రభుత్వ వాదనల్నీ తీర్పులో పొందుపరిచిన బెంచ్.

-హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్న సుప్రీం బెంచ్

-నాలుగు వారాల్లో తీర్పు అమలు చేయకపోతే ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందన్న సుప్రీం కోర్టు

2020-06-03 08:10 GMT

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)

-గ్రామ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

-పిటిషన్ ను డిస్మిస్ చేసిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం.

-నాలుగు వారాల్లో తొలగించకపోతే, కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న ధర్మసనం.

-4వ రంగుని కలపడంపై తీవ్ర అభ్యంతరం.

2020-06-03 08:06 GMT

తిరుమలలో గత రెండు రోజులుగా రింగ్ రోడ్డు, కర్ణాటక సత్రం ప్రాంతాల్లో సంచరించిన చిరుత.

నేడు ఈ ప్రాంతాలలోని కి వచ్చే చిరుత హల్చల్ చేయడంతో భయంతో పరుగులు తీసిన కర్ణాటక సత్రం, ఇతర మఠాలలో పనిచేసే సిబ్బంది.

2020-06-03 08:05 GMT

విశాఖ పాడేరు ఐటిడిఎ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం సీజనల్ వ్యాధులుపై సమీక్ష జరుగుతున్న సమయంలో

శ్రీకాకుళం ADMHO చెంచయ్య కు అస్వస్థత.

2020-06-03 05:08 GMT

తూర్పుగోదావరి జిల్లా

శంఖవరం మండలం

నెల్లిపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై పడ్డ పిడుగు 18 మందికి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

Tags:    

Similar News