Live Updates:ఈరోజు (జూలై-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 31 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ద్వాదశి (రాత్రి 11-03 వరకు) తదుపరి త్రయోదశి; జేష్ఠ నక్షత్రం (ఉ. 8-33వరకు) తదుపరి మూల నక్షత్రం, అమృత ఘడియలు ( రాత్రి 1-35 నుంచి 3-0వరకు), వర్జ్యం (సా. 4-17 నుంచి 5-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-15 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
ప్రకాశం: కురిచేడు లో శానిటైజర్ తాగి మృతి చెందిన పదిమందిలో నలుగురికి కరోనా పాజిటివ్ ...
వీరితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు చేసేందుకు అధికారుల ఏర్పాట్లు....
తూర్పు గోదావరి: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మూడు రాజధానులు బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు
- శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేస్తూ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకో వచ్చిందన్నారు.
- ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ సమగ్రంగా పరిశీలించి, వివిధ వర్గాలతో చర్చించి, న్యాయపరమైన సలహాలు తీసుకుని బిల్లును ఆమోదించడం జరిగిందన్నారు.
- రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.
- మూడు రాజధానులు బిల్లు ఆమోదంపై రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు.
- అమరావతిని అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని తీవ్రంగా విమర్శించారు.
- రాజధాని ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన భూములను 3 కోట్ల రూపాయలు విక్రయించుకున్నారని,
- ఎకరం పది కోట్ల రూపాయల విలువ పెంచేందుకే చంద్రబాబు బినామీల చే ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు.
- రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు త్రయం సృష్టిస్తున్న అడ్డంకులు ఎంతోకాలం నిలబడవన్నారు.
- అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కు గుణపాఠం చెప్పినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదన్నారు.
కడప : మూడు రాజధానుల బిల్లు ఆమోదం, సిఅర్ డిఎ రద్దుపై డిప్యూటి సిఎం అంజాద్ భాషా గారు హర్షం...
- అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, పాలన వికేంద్రీకరణ...
- ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ గారు ఆమోదించడం శుభపరిణామం...
- అమరావతి రైతులు నష్టపోకుండా అభివృద్ధి చేసేందుకు సిఎం వైఎస్ జగన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు...
- భవిష్యత్తులో రాష్ట్రంలో అసమానతలు, భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా సమగ్రాభివృద్ధి
కాకినాడ: మాజీ ఎంపి ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు కామెంట్స్..
- అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించడం శుభ సూచికం..
- రాష్ట్ర పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది..
- దాన్ని చంద్రబాబు పక్కన పడేసి పాఠశాలలను ఏలా నడపాలో తెలియని నారాయణ ను రాజధాని కమీటీ ఛైర్మన్ గా పెట్టారు..
- నారాయణ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు గుంటూరు - విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా పెట్టారు..
- అమరావతి ప్రాంతంలో భూముల తవ్వతుంటే నల్లటి సారవంతైన మట్టిని చూశా..
- అటువంటి మట్టిని చూస్తే భూదేవి చూసినట్లుగా రైతు పులకించిపోతాడు..
- అలాంటి భూదేవి గర్భాన్ని తవ్వి రాజధాని నిర్మిస్తే చంద్రబాబు కు భూదేవి శాపం తగులుతుందని నాకు చాలా మంది చెప్పారు..
- రాజధాని భవనాల పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ తయారు చేసి దాన్ని సినిమా దర్శకుడు తో అప్రూవ్ చేయించారు..
- అందుకే ప్రజలు చంద్రబాబు కు తగిన తీర్పు ఇచ్చారు..
- వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజధాని పెద్ద మోసమని అధికార వికేంద్రీకరణ పై చారిత్మక నిర్ణయం తీసుకున్నారు..
- అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోడం కోసం చంద్రబాబు ఒక డ్రామా కంపెనీనే నడిపారు..
- కాని న్యాయానికి ఎప్పుడు మంచే జరుగుతుంది..
- సిఎం జగన్ వెనుక దేవుడు ఉన్నాడు.. ఆ దేవుడే సహయ పడతాడు అని చెప్పడానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదమే ఒక ఉదాహరణ..
- సిఎం జగన్ కు వ్యక్తిగతంగా ఇది ఒక పెద్ద విజయం.
తూర్పుగోదావరి: అమలాపురం రూరల్ మం. ఇందుపల్లిలో చెయిన్ స్నాచింగ్ జరిగింది.
- మహిళ మెడలోని బంగారు హారం, నెక్లెస్, పుస్తులతాడు లాక్కెళ్లిన దుండగులు..
- ఇందుపల్లిలో సరస్వతి దేవి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన..
- బైక్ పై వచ్చి సుమారు రూ. 8 లక్షల విలువైన 25 కాసుల నగలు దోచుకెళ్లిన దుండగులు..
- విచారణ చేస్తోన్న పోలీసులు..
-బక్రీద్ ప్రార్ధనలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆదేశాలు
- మసీదులు, ప్రార్ధనాస్ధలాల్లో 50-60 మంది వరకు మాత్రమే ప్రార్ధనలు చేసేందుకు అనుమతి
- ప్రార్ధనాల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా... ప్రార్ధనల కోసం వచ్చే ప్రతిఒక్కరు వారికవసరమైన ప్రార్ధనా సామాగ్రిని వారే తెచ్చుకోవాలి.
- మసీదు నిర్వాహక కమిటీలు ప్రార్ధనలకు వచ్చే వారికి సరిపడా సానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న చిన్నారుల,వృద్ధులను సామూహిక ప్రార్ధనలకు బదులుగా ఇంటివద్దే ప్రార్ధనలు చేసుకోవాలని సూచన.
- ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ డిఫార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాజ్ రిజ్వీ.
- సీఎం జగన్ సంకల్పానికి ఇదొక ఉదాహరణ..
- చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం సృష్టించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతి..
- వైఎస్ జగన్ సొంత ప్రయోజనాల కోసం చేయడం లేదు..
- ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే జగన్ పాలన వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చారు..
- గవర్నర్ ఆమోదం తెలపడం చాలా సంతోషకరం..
- ఉత్తరాంధ్రకు ఇదొక వరం వంటిది..
- మా ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి రైతుల్లో మనోధైర్యాన్ని నింపాము..
- గత ప్రభుత్వం నెరవేర్చని హామీలను మేము నెరవేర్చారం..
- అమరావతి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడి భూములను అభివృద్ధి చేస్తాం..
- అమరావతి రైతులు తక్కువనో, ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువనో జగన్ బేధాలు చూపరు..
- అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..
- అమరావతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అక్కడి అభివృద్ధి ఉంటుంది..
- గోదావరి డెల్టా ప్రాంతంలో ఇంజినీరింగ్ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రులు కన్నాబాబు,అనిల్ కుమార్ యాదవ్ రాజమండ్రి, కాకినాడ, కాకినాడ రూరల్ ప్రాంతాలలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల కాలవలు, వంతెన నిర్మాణాలపై సమీక్ష
- కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న కాలవలు,వంతెనలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచన కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రులు
- ఈస్ట్ గోదావరి, కాకినాడ రూరల్ లో పెండింగ్ లో ఉన్న పనుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచన చేసిన మంత్రులు
- గోదావరి పరిసర ప్రాంతాల నీటి పారుదల వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
- దీని కోసం పకడ్బందీగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రికి తగిన నివేదిక సమర్పించేలా ప్రణాళిక రూపకల్పన చేయాలన్న మంత్రులు
- సీఆర్‌డీఏ, రాజధాని బిల్లుల రద్దు చేయడం సరైనది కాదు
- శ్రావణ శుక్రవారం నాడు బిల్లుల రద్దు దారుణం
- సుప్రీంకోర్టు కనగరాజ్ విషయంలో ఇచ్చిన డైరెక్షన్ ఒక గుర్తుగా గవర్నర్ గుర్తు చేసుకోవాలి
- ఎటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు
- రాష్ట్ర భవిష్యత్తు ఇవాల్టితో అంధకారంలోకి వెళ్ళిపోయింది
- వ్యవస్ధ మరోసారి భంగపడుతుంది
- ఈ నిర్ణయం రైతులను హత్య చేయడమే
- కోర్టులు అమరావతికి న్యాయం చేస్తాయి
బ్రేకింగ్:
ఏపీ ఎలక్షన్ కమీషనర్ గా ఆగష్టు 3న బాధ్యతలు తిరిగి స్వీకరించనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్
హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయాలని గవర్నర్ ఆదేశం తరువాత జీఓ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం