Live Updates:ఈరోజు (జూలై-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 27 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం సప్తమి (ఉ.7-09 వరకు) తదుపరి అష్టమి (తే.4.58వరకు) తదుపరి నవమి, చిత్త నక్షత్రం (ఉ. 11-03 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం (సా. 4-20 నుంచి 5-51 వరకు) దుర్ముహూర్తం (మ. 12-39 నుంచి 1-31 వరకు తిరిగి మ.3.14 నుంచి సా.4.05 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32
ఈరోజు తాజా వార్తలు
- కరోనా మహమ్మారి వ్యాప్తి..మరణాల రేటుకంటే కోలుకున్నవారి సగటు ఎక్కువగా ఉంది.
- ఇది ఒక శుభావార్తగా భావించవచ్చు.
- ప్రపంచవ్యాప్తంగా కరోనాను జయించిన వారి సంఖ్య కోటి దాటింది.
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ కరోనా నుంచి దాదాపు రెండు లక్షల మంది బాధితులు కోలుకుంటున్నారు.
- సంక్రమణ రేటు 10.5 శాతం, మరణాల రేటు 5.6 శాతంగా ఉండగా, వ్యాధి నుంచి కోలుకునేవారు 13శాతంగా ఉన్నారు.
- గడచిన ఎనిమిది నెలల్లో ప్రపంచంలో 1.62 కోట్ల మందికి కరోనావైరస్ సోకింది. 6 లక్షల 49 వేల 884 మంది లమృతిచెందారు.
- ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62 లక్షలుగా ఉంది. భారతదేశంలో కరోనా రికవరీ రేటు 63.5 శాతంగా ఉంది.
- శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
- ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది.
- అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది.
- అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను...
- ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
- ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
- గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి.
- ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
- ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కు పెరిగింది.
- వైరస్ బారిన పడి కొత్తగా 708 మరణించడంతో మృతుల సంఖ్య 37,771కి పెరిగింది.
- ఇక వివిధ ఆస్పత్రుల్లో 4,85,114 మంది చికిత్స పొందుతుండగా..
- 9,17,568 మంది కోలుకుని ఇళ్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది.
- నిన్న ఒక్కరోజే 31,991 మంది కోలుకోవడం గమనార్హం.
- బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.
- ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి.
- ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి.
- ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.