Live Updates:ఈరోజు (జూలై-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 22 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం విదియ (రా. 8-24 వరకు) తర్వాత తదియ, ఆశ్లేష నక్షత్రం (రా.9-04 వరకు) తర్వాత మఘ నక్షత్రం.. అమృత ఘడియలు ( రా. 7-30 నుంచి 9-03 వరకు), వర్జ్యం ( ఉ. 10.09 నుంచి 11-42 వరకు) దుర్ముహూర్తం (ఉ.11-40 నుంచి 12-31 వరకు తిరిగి రా.10-59 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ.12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-33
ఈరోజు తాజా వార్తలు
- వేణుగోపాల్ కు.. బిసి సంక్షేమ శాఖ..
- అప్పలరాజు... పశు, మత్య్స శాఖ..
- ధర్మాన... డిప్యూటీ, రెవెన్యూ
- శంకర్ నారాయణ... రోడ్లు భవనాలు..
- ఉస్మానియా ఆసుపత్రిని వెంటనే కలీచేసి సీల్ వేయాలని ఆదేశాలు.
- పాతభవనంలోని అన్ని డిపార్టుమెంటు లను షిఫ్ట్ చెయ్యాలని ఆదేశాలు.
- ఆదేశాలు జరీ చేసిన డీఎంఈ రమేష్ రెడ్డి.
- ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి సీల్.
ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈనెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడిని ఎస్సై విజయ్ కుమార్ చితకబాదారు. సదరు యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతి చెందాడు.
- పూర్తి వివరాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ వచ్చి రాగానే.. ఎంటర్ టైన్ మెంట్ కు బ్రేక్ లు వేసింది. దీంతో టూరిజం స్పాట్లు వెలవెలబోతున్నాయి. నాలుగు నెలలుగా జన సందడి లేక పర్యాటక కేంద్రాలు పరితపిస్తున్నాయి. ఒకప్పుడు వర్షం కాలం రాగానే నాగార్జున సాగర్ అందాలను వీక్షించేందుకు టూరిస్ట్ లు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ జలాలు పుష‌్కలంగా ఉన్నా జనాలు లేక వెలవెలబోతోంది.
- పూర్తి వివరాలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడానికి లైన్ క్లియర్ అయింది.
- నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తిపై రాజ్‌భవన్ స్పందించింది. రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆయనను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
- రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ తాజా ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. టెస్ట్ లు నిర్వహించినదగ్గర్నుంచి చికిత్స అందించడం వరకు ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న తీరును అభినందించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా పరీక్షలు చేయడం వల్ల అయన సంతోషం వ్యక్తం చేశారు.
ఎగువ ప్రాంతాల్లో వరదల వల్ల నీటి తీవ్రత పెరగడం వల్ల శ్రీశైలం నిండుతోంది. గత పదిహేను రోజులుగా వీటి ప్రవాహం కొసాగుతుండటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఇన్ఫ్లో పెరగడంతో కొంతనీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి హంద్రీ వరద తోడవడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది.
ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగు రాజ్యసభ పభ్యుల్లో అనూహ్యంగా మోపిదేవి. చంద్రబోస్ తెరపైకి వచ్చారు. వాస్తవంగా వీరు శాసన మండలి సభ్యులు కాగా, మంత్రులుగా నియమించారు. అయితే వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించడంతో శాసనమండలి రద్దుకు సిఫార్సు చేస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వీరిద్దరికీ సభ్యత్వం రద్దవుతుందనే కారణంగా రాజ్యసభకు పంపించారు.
అయితే తరువాత మరికొంత మందిని శాసనమండలికి వైఎస్ జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వీరు రాజ్యసభకు ఎన్నిక కాగా మరో ఇద్దరు అయోద్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీలను రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే వీరిలో ఈ రోజు రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంకాగా మరో ఎంపీ సత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు.
మంత్రులు మోపిదేవి, చంద్రబోస్ లు రాజ్యసభకు ఎంపిక కాగా, వారి స్థానాల్లో నియమించిన కొత్త మంత్రులు అప్పలరాజు, వేణుగోపాలకృష్ణలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రారంభం నుంచి కొత్త మంత్రులను ఎంపిక విషయంలో పలు ఊహాగానాలు రాగా, రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల సామాజిక వర్గం నుంచే కొత్త వారిని ఏపీ సీఎం జగన్ నియమించారు.