జలమండలికి తగ్గనున్న కోట్ల భారం..
ఎన్నో ఏళ్ల నుంచి అధిక విద్యుత్ చార్జీల భారంతో జలమండలి సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అధిక విద్యుత్ చార్జీలను తగ్గింపు జరిగింది. దీంతో జలమండలికి ఈ భారం నుంచి విముక్తి లభించింది. భారీ మోటర్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి ఒక ఫేజ్ ద్వారా నగరానికి తాగునీటిని తీసుకువస్తున్నారు.
సచివాలయం భవనం డిజైన్ ఖరారు చేయనున్న కేసీఆర్!
పాత సచివాలయం భవనాన్ని కూల్చి, కొత్త సచివాలయం భవనాన్ని కట్టేందుకు మార్గం సుగమం అయింది. హైకోర్టు, సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ సచివాలయానికి అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో పాత సచివాలయ భవనం మరి కొద్ది రోజుల్లోనే పూర్తిగా నేల మట్టం కానుంది. దీంతో తెలంగాణ సర్కారు వీలైతే ఈ శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయం నిర్మాణ పనులను ప్రారంభించాలని చూస్తుంది.
ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు మంత్రి బాధ్యతలు
రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు మంత్రి బాధ్యతలు అప్పగించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!!!
- కుటుంబ సమేతంగా అమరావతి రావాలంటు ఫోన్ కాల్
- ఈరోజు అమరావతి బయలుదేరిన
- ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణ...
- రేపు కుటుంబ సభ్యులు అమరావతి చేరుకుంటారు
త్వరలోనే టెన్త్ ఒరిజినల్ మెమోలు
తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల షాట్ మెమోలను ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఎస్సెస్సీ బోర్డు అధికారులు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లుచేస్తున్నామని తెలిపారు. అయితే ఈ మెమోలు విద్యార్ధులకు పంపిణీ చేయడానికి ముందు మెమోల్లో విద్యార్ధులకు సంబంధించిన పేరు, పుట్టిన తేది, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా వేవో పరీక్షించుకోవడానికి అవకాశం కల్పించింది.
వినియోగదారులకు ఏపీ షాక్..
కరోనా పుణ్యమాని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆదాయం పేరు చెప్పి, తీసుకున్న ఈ నిర్ణయంతో మద్య తరగతి ప్రజలకు అదనపు భారం పడుతుంది. ఇటీవల కాలంలో సాధారణ మధ్యతరగతి వారంతా ఎక్కడికి వెళ్లాలన్నా చిన్నపాటి మోటార్ సైకిల్ ను వినియోగిస్తున్నారు.
నేటి నుంచి టైంస్లాట్ టోకెన్లు నిలిపివేత..
- కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానికి ఇదే నిదర్శనం...
- నాలుగైదు రోజు ల క్రితం సింగిల్ నెంబరు మీదుంటే పాజిటివ్ కేసులు ప్రస్తుతం రెండు దాటి మూడు నెంబర్లకు చేరాయి.
- తాజాగా టీటీడీలో 170 మంది వరకు పాజిటివ్ లు నమోదయినట్టు తెలుస్తోంది.
- తిరుపతిలో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ప్రకటించారు.
- లేనిపక్షంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చుతుందని ఆందోళన చెందుతున్నారు.
- శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
- తిరుపతి నగరంలో కంటైన్‌మెంట్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం అనగా జూలై 21వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేసింది.
నెలాఖరులోగా బీసీ కార్పోరేషన్ పాలకవర్గం..
ఇంతవరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు పథకాలను అందించిన సీఎం జగన్మోహనరెడ్డి ప్రస్తుతం వాటి పాలకవర్గం ఏర్పాటు చూసేందుకు కసరత్తు చేస్తున్నారు. బీసీలకు సంబంధించి ప్రభుత్వం అందించే పథకాలు సంపూర్తిగా అందుతున్నాయా?లేదా? అనే దానిపై పాలకవర్గం ఫోకస్ చేయాల్సి ఉంది. ఈ విధంగా పథకాలను మరింత పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు పాలకవర్గాలు దోహదం చేయాల్సి ఉందని జగన్ చెప్పారు.
నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు
నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 532.00 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 28,289 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 172.0706 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!
- కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.
- జనార్ధన్‌కు గుండెపోటు రావడంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ కన్నుమూశారు.
- 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కురుపాంలో థాట్రాజ్ నామినేషన్ వేయగా...కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.
- ఈయన శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు
తిరుపతి లో 14 రోజుల పాటు లాక్‌డౌన్!
- తిరుపతిలో కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా మంగళవారం నుంచి ఆగస్టు 5వ తేది వరకు.. 14 రోజులపాటు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయి.
- ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, కమిషనరు గిరీషతో కలిసి కలెక్టర్ భరత్‌గుప్తా మీడియాతో మాట్లాడారు.
- తిరుపతిలో 50 వార్డుల్లోనూ 20 కేసులు దాటాయని, కొన్నింట్లో 40 కూడా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
- నగరమంతా కంటైన్‌మెంట్ జోన్‌గా మారిందన్నారు. అన్ని వ్యాపారాలు ఉదయం 11 గంటలకే అనుమతి ఉంటుందన్నారు.
- వైద్య అవసరాల కోసం ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల కేంద్రాలు ఉంటాయ న్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బ్యాంకుల సహా అన్నింటినీ మూత వేయాల్సిం దేనన్నారు.
- ఈ నెలాఖరున పరిస్థితిపై సమీక్షించి మరోసారి నిర్ణయం ఉంటుందని తెలిపారు.