Live Updates:ఈరోజు (జూలై-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-20 01:34 GMT

ఈరోజు సోమవారం, 20 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అమావాస్య (రా. 10-44 వరకు) తర్వాత శుక్లపక్ష పాడ్యమి, పునర్వసు నక్షత్రం (రా. 9-53 వరకు) తర్వాత పుష్యమి నక్షత్రం.. అమృత ఘడియలు ( రా. 7-27 నుంచి 9-04 వరకు), వర్జ్యం ( ఉ. 9-45 నుంచి 11-22 వరకు తిరిగి తె. 5-48 నుంచి) దుర్ముహూర్తం (మ.12-31 నుంచి 1-23 వరకు తిరిగి మ. 3-07 నుంచి 3-58 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-07-20 14:27 GMT

అమరావతి: అమూల్‌ తో అవగాహన ఒప్పందం నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

- అవగాహన ఒప్పందంలోని అంశాలను సీఎం వైయస్‌.జగన్‌కు వివరించిన అధికారులు

- రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి రంగంలో కీలకపాత్ర పోషించనుందన్న అధికారులు

- రాష్ట్రంలో మహిళా పాడి రైతులను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావడంలో ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి.

- మహిళల సాధికారతకూ తోడ్పాటునందిస్తుందని వెల్లడి

- మొత్తంగా డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్న సీఎం

- పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకి, నాణ్యమైన పాలఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్న సీఎం

- ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రంలో పాడిపరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం

- వైయస్సార్‌ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం.

- మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించేదిశగా పాడిపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి

- ఆ పరిశ్రమల్లో వారికున్న అవకాశాలను పరిశీలించి మహిళలను ముందుకు నడిపించాలన్న సీఎం.

2020-07-20 14:21 GMT

- అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యల్లో మరో కీలక అడుగు

- రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10 కి పెంపు

- వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలకు నిర్ణయం

- జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి

- ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు

- ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారీ

- 5 రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు

- వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశం

- కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం

- కోవిడ్‌ ఎవరికైనా వస్తుంది, ఆందోళన వద్దు

- వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలి*

- 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతోంది

*- జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి

- దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దు*

2020-07-20 12:34 GMT

- జూలై 23 న వాయిదా వేస్తూ కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు..

- ఈరోజు జరగవలసిన బెయిల్ పిటిషన్ వాదప్రతివాదనలు పై మొక భాస్కరరావు తరఫున వారి కుటుంబ సభ్యులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రామకృష్ణ వాదనకు అభ్యంతరం తెలియపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి DGP కి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు..

- కొల్లు మంత్రిగా ఉండగా కృష్ణా జిల్లా కోర్టు పి.పి.ని నియమించారు కాబట్టి వారికి న్యాయం జరగదని పి.పిని మార్చాలని మెమో దాఖలు చేశారు...

- అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కూడా ఈ కేసులో తనని తప్పించాలని కూడా మెమో దాఖలు చేశారు..

- వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించాల్సి ఉన్నందువలన కేసును 23కి వాయిదా వేశారు..

2020-07-20 12:02 GMT

జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ సచివాలయ భవనాల కూల్చివేత, నూతన సెక్రటేరియట్ నిర్మాణంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఇందులో భాగంగానే సోమవారం ఎన్‌జీటీ విచారన చేసి సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది.

- పూర్తి వువరాలు 

2020-07-20 11:05 GMT

- యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా

- ఇప్పటికే ఈ కుటుంబంలో అర్జున్ మేనల్లుడు ధృవ సర్జకు కరోనా పాజిటివ్ వచ్చింది.

- అర్జున్ కూతురు ఐశ్వర్యకు కూడా కరోనా రావడంతో వెంటనే ఆమెను చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.

2020-07-20 11:02 GMT

- డాలర్ శేషాధ్రికి కరోనా సోకిందంటూ ట్వీట్ ... వ్యక్తిపై కేసు నమోదు

- తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది.

- తన ఆరోగ్యంపై బద్రి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ... తితిదే ఉన్నతాధికారులకు డాలర్‌ శేషాద్రి ఫిర్యాదు చేశారు.

- డాలర్‌ శేషాద్రి ఫిర్యాదును పరిశీలించిన తితిదే ఉన్నతాధికారులు.. విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు వివరించారు.

2020-07-20 11:01 GMT

తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనని విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

- పూర్తి వివరాలు 

2020-07-20 10:56 GMT

- కడప జిల్లా రాయచోటి కి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం పేరు ఖరారు

- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజు పేరు ఖరారు

- ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్

- ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ ను కోరిన ప్రభుత్వం

2020-07-20 10:55 GMT

అమరావతి: ఈ నెల 22 మధ్యాహ్నం 1గంట తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ

- ఆరోజు ప్రమాణ స్వీకారం చేయనున్న ఇద్దరు కొత్త మంత్రులు

- రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం

- తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం

- శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య కార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం

- మంత్రి వర్గవర్గ సభ్యుల పేర్లను రేపు అధికారికంగా వెల్లడించనున్న ప్రభుత్వం

- మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం

- మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చంటోన్న అధికార పార్టీ నేతలు

2020-07-20 10:54 GMT

అమరావతి: గవర్నర్ నామినేట్​ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు.

- గవర్నర్ నామినేట్​ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు.

- పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత, దివంతగ అఫ్జల్​ ఖాన్ సతీమణి మైనా జకియా ఖానం పేర్లు ఖరారు ...

Tags:    

Similar News