Live Updates:ఈరోజు (జూలై-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-17 01:53 GMT
Live Updates - Page 2
2020-07-17 04:56 GMT

ఎక్కడికక్కడే లాక్ డౌన్..

అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కరోనా కేసులే... కరోనా మరణాలే... అయితే ప్రభుత్వం చేసింది చేస్తోంది... అయినా ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేకపోతున్నారు. దీనివల్ల కేసుల తీవ్రత పెరగడంతో పాటు గతంలో మాదిరి కాకుండా మరణాల శాతం పెరుగుతూ వస్తోంది. దీనిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం లాక్ డౌన్ గానే ప్రజలు గుర్తించారు. దీనిని వ్యాపార వర్గాలు సైతం తన మద్దతు ప్రకటిస్తున్నాయి.

- పూర్తి వివరాలు 

2020-07-17 04:55 GMT

యూజీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు..

- కరోనా వైరస్ పుణ్యమాని విద్యా వవస్థ అంతా అతలాకుతలం అయ్యిందనే చెప్పాలి.

- ఏ పరీక్షలున్నాయో, ఏవి లేవో తెలియని దుస్థితి. ఒక వేళ నిర్వహిద్దామని భావించినా, దానికి తగ్గట్టు పరిస్థితులు లేకపోవడంతో ఏ కొంప మునుగుతుందోనని ప్రభుత్వాల ఆందోళన.

- ఇలాంటి పరిస్థితుల్లో యూజీసీ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది.

- అయితే దీనికి సంబంధించి ఈ రోజు గవర్నర్ ఆయా యూనివర్సిటీల చాన్స్ లర్, వైఎస్ చాన్స్ లర్స్ తో వీడియో కాన్స్ రెన్స్ నిర్వహించనున్నారు.


2020-07-17 04:53 GMT

వీధి బాలలకు కరోనా పరీక్షలు..

కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి విషయంలో ఏపీ ముందంజలో ఉంది. నేరుగా రోగులకు అనుమానితులకు మాత్రమే కాకుండా, వీధి బాలలకు సైతం ముస్కాన్ కోవిద్ 19 పేరుతో పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు ఎక్కడికకక్కడ ఆస్పత్రి స్థాయిని బట్టి జిల్లాలో మూడు, నాలుగు చోట్ల కోవిద్ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, మొబైల్ బస్సు, వ్యాన్ ల్లో వీటిని చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

- పూర్తి వివరాలు 

Tags:    

Similar News