నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. వివరించనున్న రాష్ట్ర పరిస్తితి
ఏపీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎంపీలు నేడు రాష్ట్రపతిని కలవనున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఆయనకు వివరించేందుకు వెళ్లనున్నట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలవనున్నారు.
గత 13 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర వాతావరణం, రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను ఆయనకు వివరించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
కరోనా విస్తరణ దృష్ట్యా పలు రూట్ల బస్ సర్వీసెస్ నిలుపుదల
అనంతపురం : రాయదుర్గం లో రేపటి నుండి కరోనా మహమ్మారి విస్తరణ దృష్ట్యా పలు రూట్లలో బస్ సర్వీసెస్ రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ డిపో ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
- నిన్న ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదు కావటం, కరోనా మరణాలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
- కేవలం అనంతపురం రూటు మాత్రమే బస్ సర్వీసెస్ అందుబాటులో వుంటాయని రాయదుర్గం డీపో మానేజర్ తెలిపారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి
జగ్గంపేట: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు అన్నారు.
- జగ్గంపేటలో ఆటో ద్వారా మైక్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, దాని బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం
పాటించాలని, శానిటైజర్ లు వాడాలని కోరారు.
- సాధ్యమైనంత వరకు ఎవరికి వారు గృహ నిర్బంధంలో ఉండాలని అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దు అని సిఐ కోరారు.
- ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలం కావున మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
- ఇప్పుడు ఎదురయ్యే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు.
- ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ టి.రామకృష్ణ, గండేపల్లి ఎస్ఐ తిరుపతిరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.