Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-13 02:15 GMT
Live Updates - Page 4
2020-07-13 04:45 GMT

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు రాజీనామా

నిజామాబాద్ : జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు రాజీనామా.

- ఆసుపత్రి లో వరుస సంఘటనల తో మనస్తాపం.

- సూపరిండెంట్ పదవికి రాజీనామా, రాజీనామా లేఖను డి.ఎం.ఏ.కి పంపిన నాగేశ్వర్ రావు.

2020-07-13 04:44 GMT

నేడు మహబూబ్ నగర్ కు రానున్న రాష్ట్ర పురపాలక, ఐటీ, శాఖ మంత్రి

మహబూబ్ నగర్.. నేడు మహబూబ్ నగర్ కు రానున్న రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు..

 పర్యటన వివరాలు..

- మహబూబ్నగర్ శివారులోని మయూరి ఎకో పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల పాల్గొంటారు...

- పట్టణ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల సముదాయం ప్రారంభోత్సవం.

- ఎస్ ఎస్ ఆసుపత్రి సమీపంలోని బైపాస్ దారిలో హరితహారం కార్యక్రమం..

- కలెక్టరేట్ సముదాయంలో ఉన్న మహబూబ్నగర్ ఎక్స్పో ప్లాజాను ప్రారంభిస్తారు.

- అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయింపు పత్రాలు అందజేత కార్యక్రమం.

- వీరన్నపేట సమీపంలోని రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులకు అందజేత కార్యక్రమం.

- అప్పన్నపల్లి సమీపంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రుణమే లలో పాల్గొంటారు.

2020-07-13 04:38 GMT

సెక్రటేరియట్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో విచారణ

- సెక్రటేరియట్ కూల్చివేతపై ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

- కూల్చివేత వల్ల వచ్చే దుమ్మూ ధూళితో శ్వాస కోస వ్యాధులు వస్తున్నాయని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన పిల్ పై సోమవారం వరకు కూల్చివేత ఆపేయాలని కోర్టు ఆదేశించింది.

- కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారని కోర్టు ఈసందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

- దీంతో ప్రభుత్వం కూల్చివేతలు నిలిపివేసింది.

- ఈరోజు ఈ వ్యవహారంపై హైకోర్టు ఏం చెప్పబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2020-07-13 04:25 GMT

అసోం రాష్ట్రంలో గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు

- అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి.

- దీంతో వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

- బార్పేట జిల్లాలోని ఓ గ్రామం వరద ముంపునకు గురవడంతో 487 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

- అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో 950 గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి.

- వరద బాధితులకు మాస్క్ లు పంపిణీ చేసి, వారు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు.

- అసోంలోని జోర్హాట్, బోనగైగాం, కామెరూప్ మెట్రో, కామెరూప్ రూరల్, బక్సా, బార్పేట, కచర్, శివసాగర్, సోనిట్ పూర్, ధీమాజీ, తిన్ సుకియా ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.

- వరదబాధిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరద సహాయ పనులు చేపట్టారు. పుతిమర్రి, బేకి, ఐ, పహుమర నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి.

2020-07-13 02:40 GMT

ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో వెస్టిండీస్ విజయం!

- కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరుగిన తొలి టెస్ట్‌ లో వెస్టిండీస్ విజయం సాధించింది.

- 284/8 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ను కొనసాగించిన ఇంగ్లండ్ 7.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది.

- ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో ఇంగ్లండ్ 204 రన్స్‌ కే ఆలౌటవ్వగా, విండీస్ 318 పరుగులు చేసింది. 2000 తర్వాత ఇంగ్లాండ్‌ గడ్డపై వెస్టిండీస్ జట్టు ఓ టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం ఇదే రెండోసారి.

- తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్‌కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.


2020-07-13 02:26 GMT

గవర్నర్ నామినేటెడ్ కోటా భర్తీకి చర్యలు

- కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మరో రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

- గవర్నర్ కోటాకు సంబంధించి ఎస్సీ, ముస్లిం వర్గాలకు వీటిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

- ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నర్‌ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

- పూర్తి వివరాలు 

2020-07-13 02:24 GMT

విజయవాడలో గొల్లపూడి మార్కెట్ కు విస్తరించిన కరోనా

- కరో్నా వైరస్ వ్యాప్తి, అక్కడా ఇక్కడా అని కాదు... ఎక్కడ పడితే అక్కడ చొరబడుతోంది... వైరస్ వ్యాపిస్తోంది.

- అతి జాగ్రత్తగా ఉండే ప్రాంతాల్లోనూ ఇది విస్తరిస్తుందంటే ఇక జనాలు తిరిగే చోట పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- అయితే వీటిని అదుపు చేసేందుకు చాలా చోట్ల స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.

- కొన్నిచోట్ల ప్రభుత్వమే లాక్ డౌన్ విదిస్తోంది. దీనిలో భాగంగా విజయవాడలో సైతం కొన్ని ప్రాంతాల్లో వివిధ మార్కెట్లలో లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకున్నారు.

- పూర్తి వివరాలు   

2020-07-13 02:21 GMT

ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ

- ఏపీ సీఎం జగన్మోహరెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ నేపథ్యంలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

- ఈ పద్ధతిని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టి దానిలోని లోపాలు, సరిదిద్ధాల్సిన వాటిపై అధ్యయనం చేశారు.

- దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

- పూర్తి వివరాలు  

Tags:    

Similar News