Live Updates:ఈరోజు (జూలై-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-12 01:29 GMT
Live Updates - Page 3
2020-07-12 01:50 GMT

సత్తెనపల్లి మండలంలో అక్రమ మద్యం పట్టివేత

సత్తెనపల్లి : నియోజకవర్గం కొమెరపూడి గ్రామంలో శనివారం సత్తెనపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది.

- ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మారయ్య బాబు మాట్లాడుతూ సత్తెనపల్లి మండలం కోమరపూడి గ్రామంలో గురజాల మండలం గోగులపాడు గ్రామం నుండి ఏనుముల రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నుండి కోమరపుడి గ్రామానికి చెందిన గోపిరెడ్డి వీరారెడ్డి తండ్రి అంజి రెడ్డి, గోపిరెడ్డి మహేస్వరరెడ్డి తండ్రి ఈ సందర్భంగా వీరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

-,అలానే ఏనుముల రాజశేఖర్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి గోగులపాడు గ్రామం ఇతను సప్లేయర్, అల్లు వీరారెడ్డి తండ్రి కృష్న రెడ్డి, జాంగా రాజశేఖర్ రెడ్డి తండ్రి రవీంద్ర రెడ్డి, తాడిపత్రి కేశవ రెడ్డి తండ్రి అయ్యప్ప రెడ్డి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని తరలిస్తుండగా వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

-  వారి దగ్గర నుండి 750 ఎం ఎల్ రాయల్ స్టాగ్ 14 బాటిల్స్, 57 బాటిల్స్ మాన్షన్ హోస్, 39 బాటిల్స్ గుడ్ డే ప్రిస్టింగ్ విస్కీ మొత్తము 110 అక్రమ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని, అలానే వారి దగ్గర నుండి ఏ పి07 బియస్ 7655 మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలానే మిగతా నలుగురు సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు.



2020-07-12 01:41 GMT

34 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం: శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు కలకలం

తిరుపతి : కరోనా నేపథ్యంలో కొంతకాలం విరామం తరువాత తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో కి ప్రవేశించారు.

- శనివారం ఉదయం 4.00 గంటలకు 34 ఎర్ర చందనం దుంగలను మోసుకెళుతూ ఉండగా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడ్డగించారు.

- దీంతో దుంగలను పడేసి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం కొందరు తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ప్రవేశించినట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవి శంకర్ కు సమాచారం అందింది.

- ఆయన వెంటనే ఆర్ఎస్ ఐ వాసు బృందాన్ని అడవుల్లో కి పంపించారు. రెండు రోజుల నుంచి కూంబింగ్ చేపట్టిన వాసు బృందానికి శనివారం ఉదయం స్మగ్లర్లు తారసపడ్డారు.

- దీనిపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ రవి శంకర్ విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 25 మంది స్మగ్లర్లు మోటారు సైకిల్ లపై ముగ్గురు చొప్పున వచ్చినట్లు తెలిసిందని చెప్పారు.

- అయితే వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా, రాళ్లు రువ్వి సిబ్బంది పై తెగబడ్డారని అన్నారు.

- దుంగలు, వారు వెంట తెచ్చుకున్న బ్యాగులు పడేసి పారిపోయారని తెలిపారు. 34 దుంగలు 1.5 టన్నుల బరువు ఉంటుందని కోటి రూపాయల పైగా విలువ ఉంటుందని అన్నారు.

- ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటయ్య, సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐ వాసు, ఎఫ్బిఓ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.



2020-07-12 01:37 GMT

తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు!

- నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి.

- దీంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

- దీని ప్రభావంతో సోమవారం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దాంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News