Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 05 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పౌర్ణిమ (ఉ.10:13రకు), పూర్వాషాడ నక్షత్రం (రా.11:02వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు గురుపూర్ణిమ. గురుపూజామహోత్సవానికి సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఈరోజు తాజా వార్తలు
- కరోనా బాధితులకు ఫోన్ చేసి వైద్య, ఆరోగ్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్న హరీశ్ రావు
- సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం.
- కొందరు కరోనా బాధితులకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి హరీశ్ రావు.
- వైద్య సేవల గురించి బాధితులను ఆరా తీసిన మంత్రి హరీశ్ రావు.
- సానుకూలంగా మాట్లాడిన బాధితులు.
- కరోనా బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వ్యవహరించాలని అధికారులకు సూచించిన మంత్రి హరీశ్ రావు.
- తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లాక్డౌన్ రోజుల్లో దొంగల స్వైరవిహారం మండలంలోని జి. మేడపాడు లో వంతెన సమీపాన ఒక ఇంటిలో తెల్లవారుజామున దొంగల బీభత్సం రూ 7.5 లక్షల విలువైన 15 కాసుల బంగారు ఆభరణాలు 1.04 లక్షల నగదు చోరీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
@ కడప జిల్లా.
- వేంపల్లె : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్
- రెడ్డి వచ్చే మొదలుపెట్టు అన్నట్టుంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి.
- 2007 లో రాజశేఖర్ రెడ్డి జమ్మలమడుగు మండలం అంభవరం వద్ద శంకుస్థాపన చేశారు.
- కడప జిల్లా నిరుద్యోగులకు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కలగానే మిగిలిపోయింది.
- 2018 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైలవరం మండలం కంబాల దిన్నెలో రాయలసీమ స్టీల్స్ పేరుతో మళ్లీ శంకుస్థాపన చేశారు.
- 3892 ఎకరాలు కేటాయించారని పైసా పని కూడా జరగలేదు.
- 2019 డిసెంబర్ 23 నా ప్రస్తుత ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు మధ్యలో మళ్లీ శంకుస్థాపన చేశారు.
- 3200 ఎకరాలు కేటాయించారు.
- బడ్జెట్లో రూ 250 కోట్లు కేటాయించారని కనీసం 250 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు.
- మళ్లీ 2020 -21బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారని చెప్పారు.
- మూడు నెలలు దాటాయి మూడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు.
- ఈ నెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారు.
- ఈ సందర్భంగానైనా స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి.
- డాక్టర్‌ను నిర్బంధించిన ఆస్పత్రి యాజమాన్యం
- కరోనా భయాలను సొమ్ము చేసుకుంటున్న చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి యాజమాన్యం.
- సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్‌కూ ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులు.
- అధిక బిల్లులపై ప్రశ్నించిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానా.
- ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానాను నిర్బంధించిన తుంబే ఆస్పత్రి సిబ్బంది.
- తుంబే ఆస్పత్రిలో 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో తెలిపిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానా.
- 31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
- దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్.
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ.
- దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం.
నేడు ఎన్నో ఆలయాల్లో వైభవంగా జరగాల్సిన గురుపౌర్ణమి వేడుకలు కళతప్పాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, పలు ఆలయాల్లో కిక్కిరిసిపోవాల్సిన భక్తులు, ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రముఖ సాయిబాబా ఆలయాల్లోనూ సందడి కనిపించడం లేదు. షిరిడీలో ప్రధాన పూజారులు పలు సేవలను స్వామికి ఏకాంతంగా జరిపించి, పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
బాసరలో సరస్వతీ దేవి అమ్మవారికి ఈ వేకువజామునే పూజారులు ప్రత్యేక పూజలు జరిపించారు. నేడు జరగాల్సిన వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. పలు ఆలయాల్లో అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించినా, భక్తులను మాత్రం అధిక సంఖ్యలో అనుమతించే పరిస్థితి లేదు. మరోవైపు జన సమూహాల్లోకి వెళితే, వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అన్న ఆందోళన సైతం నేడు భక్తులను ఆలయాలకు దూరం చేసింది.
న్యూఢిల్లీ
★ గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,850 కేసులు.. 613 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
★ దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,73,165కి చేరింది.
★ వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,44,814 మంది చికిత్స పొందుతుండగా.. 4,09,083 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.
★ కరోనాతో ఇప్పటి వరకు 19,268 మంది ప్రాణాలు కోల్పోయారు.
విశాఖ యలమంచిలి పట్టణంలో గల కూరగాయల మార్కెట్ భవనాలు తరలింపులో నిబంధనలు ఉల్లంఘించారని మున్సిపల్ కమిషనరను సస్పెండ్ చేసిన మున్సిపల్ అడిషనల్ డైరెక్టర్ రమేష్
విశాఖ యలమంచిలి పట్టణంలో గల కూరగాయల మార్కెట్ భవనాలు తరలింపులో నిబంధనలు ఉల్లంఘించారని మున్సిపల్ కమిషనరను సస్పెండ్ చేసిన మున్సిపల్ అడిషనల్ డైరెక్టర్ రమేష్
వైజాగ్: ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కనకారావు పై సస్పెన్షన్ వేటు
- నిబంధనలకు విరుద్ధంగా మార్కెటింగ్ షాపింగ్ భవనం కూల్చివేశారని ఆరోపణ