Live Updates:ఈరోజు (జూలై-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 04 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చతుర్దశి (ఉ.11:33రకు), మూల నక్షత్రం (రా.11:22వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
@ మచిలీపట్నం
- మంత్రీ పెర్ని నాని కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్
- హోం క్వారంటైన్లో మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది
సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాలపై కొవిడ్ ప్రభావం పడిందన్న మంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సీఐఏకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఎక్స్‌కాన్ వంటి కార్యక్రమాలను సీఐఏ హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు.
- స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.
- స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్, మీనాక్షి అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
- ప్రజల దగ్గర నుండి డబ్బులు వసులు చేసి ఆ డబ్బులతో భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
- ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
- బందరు మాచవరం ప్రాంతంలో హత్యాయత్నం దాడి
- కార్ ఫైనాన్స్ నిమిత్తం
- డబ్బులు అడిగేందుకు వెళ్ళిన వరుణ్ మారుతి గుడివాడ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన వైనం
- మచిలీపట్నం చిలకలపూడి చెందిన జ్యువెలరీ షాపు యజమాని నాగేశ్వర రావు అతని కుమారుడు ఇద్దరు కలిసి హత్యాయత్నం కి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
- పక్కా పథకం ప్రకారం మాచవరం లో రోడ్ల పక్క వాళ్ళ దుకాణాల వద్ద కత్తితో పొడిచి పక్కనే ఉన్న డ్రైనేజీ లో పడేసి పరారైన నిందితులు.
- హత్యకు గురైన వ్యక్తి గుడిసె రాజేష్ పెడన దక్షిణ తెలుగు పాలెం 19 వార్డు కి చెందిన వ్యక్తిగా నిర్ధారించిన పోలీసులు.
- హత్యాయత్నానికి ప్రయత్నించిన తండ్రి కొడుకుల కోసం గాలిస్తున్న పోలీసులు
- గాయపడ్డ గుడిసె రాజేష్ ను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- కత్తి పోట్లతో గాయపడ్డ రాజేష్ పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు. ఆంధ్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనా తో మృతి చెందారు.. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు..పోకూరి రామారావు తన అన్న పోకూరి బాబురావు తో కలిసి ఈతరం బ్యానర్ పైన సినిమాలు నిర్మించారు..
భాగంగానే యంగ్ హీరో గోపీచంద్ తో యజ్ఞం, రణం అనే సినిమాలను తెరకెక్కించారు. రామారావు మృతిపట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సంతాపం తెలుపుతుంది..
శాంతిపురం: అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని వైఎస్సార్ పార్టీ కుప్పం ఇంచార్జ్ భరత్ స్పష్టం చేశారు.
- మండలంలోని అబకల దొడ్డి, సోన్నేగాని పల్లి సమీపంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని శనివారం భరత్, వైసిపి శ్రేణులు పరిశీలించారు.
- రాష్ట్రంలో పక్కా గృహాలు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాల నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. - రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేయడమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
విశాఖపట్నం: కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది.
- రైల్వే కోచ్‌లు శుభ్రం చేసే ట్రాక్‌కు సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
- రైల్వే బోగీల్లోని కొన్ని వ్యర్ధ పరికరాలు ఒకచోట కుప్పగా పోసి ఉంచారు.
- శుక్రవారం మధ్యాహ్నం వాటికి నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
- విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
- అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు పెద్దగా చెలరేగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పాడేరు : మండలంలోని మద్దులబంధ గ్రామానికి చెందిన అప్పన్న అనే రైతు తన రెండు ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు.
- అర ఎకరంలో పసుపు, పిప్పర మోడీని పండిస్తూ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నాడు.
- మిగిలిన ఎకరం పొలంలో వెదురు, కిత్తనార, పైనాపిల్, నార, సిల్వర్, మామిడి, మల్బరీ, కాంగు, అరటి, కాఫీ, నిరోడి , బొక్కెడు చెట్టు, మునగ, బొప్పాయి, కులవరి, మండి చెట్టు, పనస, చెరకు, పంపర - మామిడి, జిగురు చెట్టు, నార, కమల, తడ, జిల్లోడి, చింత వంటి వివిధ రకాలు చెట్లు వేశాడు.
- ఇవే కాకుండా మరికొన్ని పంటలను విత్తుకొని వాటిపై పరిశోధనలు చేస్తున్నాడు.
- ప్రస్తుతం నీటి కొరత ఉందని కొండవాగు నుంచి నీటిని తెచ్చి మెుక్కలను బతికిస్తున్నానని అధికారులు సబ్సడీపై డీజిల్ మోటర్ ఇప్పించాలని వేడుకుంటున్నాడు.
కోరుకొండ : రాజనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆదివారం కోరుకొండ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
- అమరావతి రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా 200 రోజులు అయిన సందర్భంగా ఈ దీక్షలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
- అదేవిధంగా తెలుగు దేశం పార్టీ బీసీ నాయకుల అరెస్టులకు నిరసన వ్యక్తం చేశారు.
- బీసీ నాయకులను అరెస్టు ద్వారా వేధించటం అధికార పార్టీ పాల్పడుతుందని అన్నారు.
- ఈ నిరసన కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు మింగి లక్ష్మీనారాయణ, తెలుగం శెట్టి శ్రీను, నాగ రమేష్, దిడ్డి మాధవరావు, కొయ్య సామ్యూల్ పరసా శ్రీను వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు జరుగనుంది.
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహించనుంది.
- దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది.
- ఇప్పటికే 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను పెంచే అంశంపై సమావేశంలో చర్చింనున్నట్లు తెలుస్తోంది.
- టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది.
- అలాగే టీటీడీ ఉద్యోగులకు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించనుంది.