Live Updates:ఈరోజు (జూలై-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 02 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వాదశి (మ.03:16వరకు), విశాఖ నక్షత్రం (తె.01:13 వరకు) సూర్యోదయం 5:45am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
న్యూ ఢిల్లీ: పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులను 2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. వీటికోసం ఆన్‌లైన్ నామినేషన్లు ఈ ఏడాది మే ఒకటో తేదీనుంచి ప్రారంభమయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్లు లేదా సిఫార్సులను పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే తీసుకుంటామని ఎంహెచ్‌ఏ పేర్కొంది.
పద్మ పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 1954నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్నారు. అన్నిరంగాల్లో విశిష్టమైన సేవలందించిన వారికి వీటిని ప్రదానం చేస్తారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు సంబంధించిన www.svbcttd.com వెబ్‌సైట్ కాలపరిమితి జూన్ 30వ తేదీతో ముగిసింది. ఈ వెబ్‌సైట్ డొమైన్ రెన్యువల్ కోసం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో డొమైన్ సకాలంలో రెన్యువల్ కానుందువల్ల జూన్ 30వ తేదీన డౌన్ అయింది. దీంతో www.svbcttd.com వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే ఎస్వీబీసీకి సంబంధం లేని వెబ్‌సైట్లు వస్తున్నాయి. దీన్ని గమనించిన టిటిడి ఐటి విభాగం డొమైన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.
@గుంటూరు
- ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో రైతుల ఖాతాలో నగదు స్వాహా
- నరసరావుపేట మండలం పాలపాడు లో వెలుగు చూసిన ఘటన
- ఎయిర్ టెల్ kyc ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకొని
- 150 మంది రైతుల ఖాతాల నుండి సుమారు 15 లక్షల నగదు స్వాహా
- జరిగిన మోసం పై నరసరావుపేట ఎయిర్ టెల్ కార్యాలయంలో సంప్రదించిన స్పందించని సిబ్బంది
- పోలీసులను ఆశ్రయించిన పాలపాడు రైతులు.
♦ మేడ్చల్ జిల్లా పోచారంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు.
♦ చిన్నారి తల్లి, మరో వ్యక్తిపై కూడా కత్తితో దాడి.
♦ కత్తితో దాడికి తెగబడటంతో పరారైన రమేశ్ అనే యువకుడు.
♦ చిన్నారి తల్లిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
♦ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
♦ ఘటనకు సంభందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శాకంబరి ఉత్సవాలు
- వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ
- మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం
- రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
- అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు
- అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన కేశఖండనశాల
- గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్న అధికారులు
పొన్నూరు: ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రూరల్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు అన్నారు.
- మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో బుధవారం వాహనాల తనిఖీలు
- ఈ సందర్భంగా మాస్కులు ధరించి కుండా రోడ్లపై తిరిగే వ్యక్తులకు, వాహనదారులకు రూ.70 జరిమానా విధించారు. పట్టణ పరిధిలో మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.
- ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం: జిల్లాలో లాక్ డౌన్ విధించింది మొదలు నిరంతరాయంగా నిరుపేదలు, దివ్యాంగులు ,అనాధలు, వలస కూలీలు, మూగజీవాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్ తెలుగు - రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి డి హెచ్ డి హెచ్ వి సాంబశివరావు సేవలందిస్తున్నారు.
- అన్నదానం, వస్త్రదానం, ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
- ఈ సేవలను గుర్తించిన ప్రముఖ ఆధ్యాత్మిక, ధార్మిక సేవా సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ కరోనా సేవా పురస్కారాన్ని అందజేసింది.
- సమరసత రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఈ పురస్కారానికి సాంబ ను ఎంపిక చేశారు.ఫౌండేషన్ కాకినాడ డివిజన్ ప్రతినిధులు పడాల రఘు, కాదా సత్యనారాయణ, టి ఆదిలక్ష్మి , భాజపా పూర్వాధ్యక్షులు వై మాలకొండయ్య తదితరులు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
- సమరసత పురస్కారాన్ని అందుకున్న సాంబశివరావును రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్, బ్రాహ్మణ మహాసేన, దేవాదాయ శాఖ ఈవోలు, సిబ్బంది, అర్చక, పురోహితులు, వేదపండితులు ఘనంగా అభినందించారు.
తుని: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సొంత నిధులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
- ఆసుపత్రి సూపర్డెంట్ విష్ణువర్ధని ఇతర పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రారంభించారు.
- ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇటువంటి సహాయ సహకారాలు లేక ఇబ్బందులు ఉన్నా హెల్ప్ డెస్క్ తెలియజేయాలనిది ముఖ్య ఉద్దేశంగా తెలిపారు.