Live Updates:ఈరోజు (జూలై-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-01 01:25 GMT
Live Updates - Page 2
2020-07-01 01:47 GMT

కుయ్ కుయ్ కు కొత్త వాహనాలు..

- ఈరోజు  తొమ్మిది గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 


2020-07-01 01:38 GMT

నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు: డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప: సీఎం ఆదేశాల మేరకు ఈరోజు నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తెలిపారు.

- కడప కార్పొరేషన్‌లో కోవిడ్‌-19పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.

- ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తోందని, అత్యధికంగా పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మాస్కులు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, మున్సిపల్‌ కమిషనరు లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహసీల్దారు శివరామిరెడ్డి పాల్గొన్నారు.



2020-07-01 01:36 GMT

పేదలందరికీ ఇల్లు పథకం క్రింద ఎంపిక చేసిన లే అవుట్ లను పరిశీలించిన జేసి

అనంతపురం: అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం క్రింద ఎంపిక చేసిన లే అవుట్ లను అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తున్నారు.

- మంగళవారం ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో, కుడేరు మండలంలోని కమ్మురు, గుంతకల్లు నియోకవర్గస్థాయిలో గుంతకల్లు మండలంలోని దొనముక్కల గ్రామాలలో తనిఖీ చేశారు.

- ఎక్స్ టెన్షన్ చేసిన లే అవుట్ లో పనులు చేపట్టాలని, అర్హలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయు విషయములో పెండిగ్ లో ఉన్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

- ఈ కార్యక్రమంలో ఉరవకొండ స్పెషల్ ఆఫీసర్ నిషాంత్ రెడ్డి, ఆర్డీవో భూషణ్ రెడ్డి, తహసిల్దార్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News