Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
కామారెడ్డి :
* బిక్నూర్ మండల కేంద్రంలోని జెండా గల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం
* 7 మంది చిన్నారులకు 3గురు వృద్దులకు గాయాలు
* ముగ్గురికి తీవ్రగాయాలు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు
* పిచ్చికుక్కలను తరలికొట్టాలని కాలని వాసుల ఆందోళన
# ప్రతి ఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయం తప్పకుండా అందుతుంది -మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్
# వరదల్లో నష్టపోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
# పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయి
#ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించైనా అర్హులైన అందరికీ తక్షణ సహాయం అందేలా చూస్తాం
# రేపు జిహెచ్ఎంసి మరియు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం తో సమీక్ష నిర్వహిస్తాను
#వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు
వరంగల్ అర్బన్:
- డిసెంబర్ 1 నుండి 8 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు...
- కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని కోరిన యూనివర్సిటీ వర్గాలు..
యాదాద్రి భువనగిరి జిల్లా:-
- చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నుండి అక్టోబర్ 27న దొంగ పారిపోయిన ఘటనలో..
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ASI రంగాచారి, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ లను సస్పెండ్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
జీహెచ్ఎంసీ...
* నవంబర్ ఏడో తేదీన ఓటర్ జాబితా ముసాయిదా ప్రకటన, 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
* తొమ్మిదో తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం
* పదో తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్కిళ్ల స్థాయిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల సమావేశం
* 13 వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటన
* జిహెచ్ఎంసి ప్రస్తుత పాలకమండలి గడువు 10 ఫిభ్రవరి 2021 తో ముగింపు
* ఈలోగానే ఎన్నికలు నిర్వహిస్తాం, అందుకు అన్ని చర్యలు చేపడతున్నాం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్,పార్థసారధి.
సిద్దిపేట :
-దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
-పాల్గొన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి...
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
* మావోయిస్టు మణుగూరు ఏరియా లోకల్ గెరిల్లా కమాండర్ మడవి మంగాలు,మడకం దేశి లు అరెస్ట్.
* ఏడూ ళ్ల బయ్యారం ఏరియా
* తిర్లాపురం అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి తుపాకి,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన
* జిల్లా SP సునీల్ దత్.
రేవంత్ రెడ్డి... మల్కాజ్ గిరి ఎంపీ.
-గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి .
-శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా... వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు .-
-మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే... వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది.
- గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారనం.
-చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు.
-మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
-రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి.
-ఇప్పటి వరకు జరిగిన దోపిడీ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి.
-లేదంటే క్షేత్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం
నాచారం..
-అమ్మకం చేసిన మీనా, వెంకటేష్ దంపతులను, కొనుగోలు చేసిన రాజేష్ ను, మధ్యవర్తి జానకిని రిమాండ్ చేసిన పోలీసులు..
-మీనా, జానకికి చంచల్ గూడ జైల్ కు తరలింపు..
-వెంకటేష్, రాజేష్ లను చర్లపల్లి జైలు కి తరలించిన అధికారులు..
ఇంద్రసేనారెడ్డి....బీజేపీ సీనియర్ నేత.
-దుబ్బాకలో బీజేపీ గెలిచేది లేదు.. పీకేది లేదనటాన్ని ఖండింస్తున్నాం
-దుబ్బాకలో మీటింగ్ పెట్టే దమ్ములేకనే .. ధరణి, రైతువేదికల పేరుతో సమావేశాలు పెడ్తున్నారు
-దుబ్బాకలో గెలుపుపై మంత్రి హరీష్ రావుకు ఆశలు సన్నగిల్లాయి
-రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న హరీష్ మాటలే ఇందుకు నిదర్శనం
-సభ్యత్వ సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు మీ నాన్నకు సంస్కారం నేర్చించు
-మక్కలు కొనటానికి కూడా కేంద్రమే నిధులిస్తోంది.
-కేంద్త నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తోంది
-గొల్ల కుర్మలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు
-అప్పు పుట్టే స్థాయిని కేసీఆర్ పోగొట్టుకున్నాడు