Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-31 01:50 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-31 14:39 GMT

తూర్పుగోదావరి...

- ఎటపాక..

- 6 గురు అరెస్టు, వారినుంచి 53వేల 400 నగదు స్వాధీనం

- కేసు నమోదు

2020-10-31 14:37 GMT

అమరావతి:

* నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటన

* గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న బృందం

* పంట, ఆస్తి నష్టం అంచనాలను సిద్దం చేస్తోన్న ప్రభుత్వం

* రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను సమర్పించనున్న అధికారులు

* వరదల కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా

* సుమారు రూ.10వేల కోట్ల మేర పంట నష్టం

* రోడ్లు, వ్యవసాయ, ఆక్వా ఉద్యాన పంటలు,విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం

* ఆర్అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారం

* దాదాపు 2.40 లక్షల రైతులు పై వరద ప్రభావం

* ఉభయగోదావరి జిల్లాల్లో దారుణంగా దెబ్బతిన్న ఆక్వారంగం

* ప్రభుత్వం రూపొందించినవరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందచేయనున్న ప్రభుత్వం

* తక్షణ సాయంగా రూ.1000కోట్లు అడగాలని భావిస్తున్న అధికారులు

* రోడ్ల మరమ్మత్తులు, రైతులు ఇన్ పుట్ సబ్సిడీ కోసం అత్యవసరంగా రూ.1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా 

2020-10-31 14:29 GMT

 కృష్ణాజిల్లా...

 - తిరువూరు కృష్ణా దియేటర్ సెంటర్ మెయిన్ రోడ్ లో మోటార్ల రిపేరింగ్ షాపులో మరమ్మత్తు కోసం తెచ్చిన మోటార్ లో త్రాచుపాము

 - చాకచక్యంగా పట్టుకున్న రెస్క్యూ టీం ఉయ్యూరు జయప్రకాష్

 - పాముని తీసుకెళ్లి అడవిలో వదిలారు..

2020-10-31 13:23 GMT

 గుంటూరు జిల్లా...

*చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో బీ.సీ. కార్పొరేషన్ చైర్ పర్సన్ లకు, డైరెక్టర్ లకు సన్మానం....

*హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి రంగనాధ రాజు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, యం.పి. లావు శ్రీ   కృష్ణ దేవరాయలు.....

2020-10-31 12:24 GMT

రాజ్ భవన్..

-సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్.

-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ కు నివాళులు.

-భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు.

-రాజ్ భవన్ ఆఫీసర్లు, సిబ్బందిచే రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు పాటుపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి భారత ఐక్యతకు చేసిన కృషి గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి   ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

2020-10-31 11:51 GMT

 కర్నూలు జిల్లా...

// అర్థరాత్రి షాపు ఎదుట నిమ్మకాయలు, పుర్రె తో పూజలు..

// భయాందోళనలో స్థానికులు...

// గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందన్న ప్రజలు...

2020-10-31 11:49 GMT

  కర్నూలు......

- కర్నూలు కలెక్టరేట్ వద్ద కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం ను అడ్డుకున్న డీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు......

- మేనేజ్మెంట్ కోటాలో, స్పాట్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో,విద్యార్థి నాయకుల అరెస్టు.......

2020-10-31 11:44 GMT

 అమరావతి

* క్షేత్ర స్థాయికి అభివృద్ధి ఫలాలు: రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది

* ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలి.

* ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక వంటిదని ఆ మేరకు పాలన సాగాలని ఆకాంక్ష.

* రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండా లి

* సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా

2020-10-31 11:40 GMT

 విజయనగరం..

* సాలూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద సీపీఎం నాయుకుల ఆద్వర్యంలో శికపరువు గ్రామస్తులు ఆందోళన.

* శికపరువు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వ్యతిరేకిస్తే కేసులు పెడతామని సిఐ సింహాద్రినాయుడు తమని బెదిరింపులు చేస్తున్నారంటూ       ఆందోళన

* మైనింగ్ కి ఊరంతా అనుకూలంగా వుండాలని, లేనిచో ఇబ్బందులు తప్పవని హెచ్చరింస్తున్న సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రినాయుడు.

* తమ గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ లపై చర్యలు తీసుకోవాలని సాలూరు ఎమ్మార్వోని డిమాండ్.

2020-10-31 11:35 GMT

విజయవాడ

- సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

- నవంబరు 6 నాటికి సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు

- దేశ చరిత్రలో తొలిసారిగా అన్ని రంగాలలో రికార్డ్ సృష్టించారు సీఎం జగన్

- సీఎం జగన్ దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడు

- చిన్న వయసులోనే నిజమైన ప్రజా నాయకుడుగా ఉన్నారు

- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభిమానులే కాకుండా రాష్ట్రమంతా ఒక మాఫియా ముఠాలాంటి పాలన నుంచీ బయటడ్డాయి

- చరిత్రలోనే ఒకే జాబితాలో 175 మంది ఎంఎల్ఏ లను ప్రకటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్

- గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఒక విజయం

- బడుగు, బలహీన వర్గాలు, స్త్రీలు ఎక్కువ మంది సచివాలయాలలో ఉద్యోగులు

- ఇంగ్లీషు మీడియంలో చదువు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడే కుటుంబాలకు, ఇంగ్లీషు చదువు వచ్చింది

- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ మహిళా పక్షపాతి

- అన్ని స్కూళ్ళనూ నాడు-నేడు లో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం

Tags:    

Similar News