East Godavari updates: లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి..
తూర్పుగోదావరి... ప్రత్తిపాడు..
-లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
-మోసపోయిన రైతులను ఆదుకోవాలి..
-మోసానికి కారణమైన డిసిసిబి చైర్మన్ వరుపుల రాజాని అరెస్టు చేయాలంటూ మోసపోయిన రైతులు ఆందోళన.
East Godavari district updates: ప్రత్తిపాడు మం లంపకలోవ సొసైటీ అవినీతిలో..
తూర్పుగోదావరి జిల్లా..
-ప్రత్తిపాడు మం లంపకలోవ సొసైటీ అవినీతిలో..
-బాద్యులను వెంటనే అరెస్టు చేయాలన్న డిమాండ్తో రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఆ సంఘం అధ్యక్షుడు గొంతిన సురేష్ , రైతులు
-సంఘంలో జరిగిన ఆర్దిక లావాదేవీల్లో సొసొటీ మాజీ అధ్యక్షుడు రైతుల సొమ్ములు రూ.16 కోట్ల 50 లక్షలను స్వాహా చేశారు -
-ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ నేత, డిసిసిబి మాజీ చైర్మన్ వరుపుల రాజాపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది
-నేపధ్యంలో దోషులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ధర్నా చేపట్టిన గొంతిన సురేష్
-సొసైటీలో నష్టపోయిన, రైతులకు సకాలంలో తగు న్యాయం చేయాలి - సొసైటీ అధ్యక్షులు సురేష్
Krishna district updates: ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం..
కృష్ణాజిల్లా..
-ముసునూరు మండలం వలసపల్లిలో దారుణం
-వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త నవీన్ బాబు.
-తనకు తెలియకుండా 1లక్షా 50 వేలకు పాపను అమ్మాడని భర్త నవీన్ బాబు పై స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య రజనీ
-బిడ్డ ఎక్కడని నిలదీసిన భార్య రజనీ పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త ,అత్త మామలు
-బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన రజనీ తల్లిదండ్రులు.
-తన బిడ్డను తనకు ఇప్పించాలని నూజివీడు ఎమ్మెల్యే ని ఆశ్రయించిన తల్లి రజినీ
-నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో పిల్లను పెంచుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఐసిడిఎస్ అధికారులు సమక్షంలో పాపను స్వాధీనం చేసుకున్న ముసునూరు పోలీసులు
-పాపను స్వాధీనం చేసుకున్న సమయంలో విచారించిన పోలీసులు
-మూడు రోజుల పాపను దూరపు బంధువులు అవడంతో పెంచుకోవటానికి తమకు ఇచ్చారని చెబుతోన్న పెంపుడు తల్లి దండ్రులు
-జరిగి ఏడాది అయిందనీ, తాము ఎలాంటి డబ్బులు ఇచ్చి కొనలేదని చెప్తున్న పెంపుడు తల్లిదండ్రులు
-రజనీ, నవీన్ దంపతులకు నలుగురు ఆడ పిల్లలు
East Godavari updates: రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి..
తూ.గో.జిల్లా....
-రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి.
-ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-రెండు కోళ్లు, 6300 నగదు స్వాధీనం.
Vijayawada updates: దళితులకు చంద్రబాబు మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు..
విజయవాడ..
-దళితులకు చంద్రబాబు మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు..
-అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం, వినతి పత్రాలు సమర్పించిన వైస్సార్సీపీ నేతలు..
-14 ఏళ్ళు అధికారంలో ఉండగా ఏనాడు దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు.. వైస్సార్సీపీ దళిత నేతలు..
-దళితులకు దక్కాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారు..
-అధికారం పోయాక దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు..
-అమరావతిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు..
-దళితులు ఇంగ్లీషు మీడియం చదవకుండా అడ్డుపడ్డారు..
-తన హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు నోరు మెడపలేదు..
-దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అవమానించారు.... వైస్సార్సీపీ దళిత నేతలు..
Visakhapatnam updates: చోడవరం వైసిపి శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కామెంట్స్
విశాఖ..
-చోడవరం వైసిపి శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కామెంట్స్
-శిరోముండనం కేసులో ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు చేస్తుంది.
-ఎవ్వరినైనా వదిలి పెట్టేదిలేదు.
-చంద్రబాబు నాయుడు దళితులపై కపటప్రేమ చూపిస్తున్నాడు.
-చంద్రబాబు నాయుడుని ప్రజలు తిరస్కరించడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు.
-టిడిపి హయాంలో దళితులపై జరిగిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు.
-విశాఖను తెలుగుదేశం పార్టీ,వారినాయకులు నాశనం చేశారు.
-దళితులు గర్వపడేలా అనేక కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది.
-విశాఖలో శిరోముండనం కేసులో 12 గంటలలో దోషులు లను అరెస్ట్ చేసాం.
-నూతననాయుడుకి, వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధంలేదు.
-దోషులను మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది.
-వైసీపీ ప్రభుత్వo చేస్తున్న అభివృద్ధిని చూడలేకే చంద్రబాబు మా పార్టీ పై బురదజల్లుతున్నారు.
East Godavari updates: ఎయిర్‌లైన్ సంస్థలో ఉద్యోగం పేరిట మోసం..
తూర్పుగోదావరి..
-ఎయిర్‌లైన్ సంస్థలో ఉద్యోగం పేరిట ఆన్‌లైన్‌లో ప్రకటనను చూసిన రాజమహేంద్రవరం శ్యామలానగర్ ప్రాంతానికి చెందిన గృహిణి కె.విశాలాక్షి మోసపోయింది
-ఆ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్
-పలు దఫాలుగా రూ.76 వేల నగదును ఆన్‌లైను ద్వారా ఆమె నుంచి అతడి ఖాతాకు జమ చేయించుకున్నాడు.
-అనంతరం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు రావాలని ఒక ఈమెయిల్ పంపించాడు.
-ఆమె రాజమండ్రి- ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆరాతీయగా అటువంటి ఉద్యోగం లేదని తేల్చిచెప్పారు
-దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ప్రకాశ్‌నగర్ కు చెందిన ఆ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది..
Vijayawada updates: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..
విజయవాడ..
-గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చదరంగ క్రీడాకారులకు అభినందనలు
-రష్యాలో జరిగిన ఫైడ్ ఆన్‌లైన్ చెస్ ఒలంపియాడ్‌లో తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించటం ముదావహం
-అనితర సాధ్యమైన
-వ్యూహాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ తదితరులు అభినందనీయులు
-చదరంగ క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలి
East Godavari updates: రాజమండ్రి లో పోలీసుల పేరుతో కొందరు దుండగుల మోసాలు..
తూర్పుగోదావరి..
-రాజమండ్రి లో పోలీసుల పేరుతో కొందరు దుండగుల మోసాలు
-జాతీయ రహదారిపై పోలీసులమని చెప్పి ఇద్దరి నుంచి రూ.2వేలు లాక్కొని పరారైన ఘటన
-బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన-రంగపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన బి.సురేష్
-ఆటోనగర్ సమీపాన్న వర్షం వర్షం వస్తుందని రోడ్డు పక్కన ఓ చెట్టు వద్ద నిలబడ్డ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెండువేలు లాక్కుల్లారు
-తాము బొమ్మూరు పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లమని చెప్పారని ఫిర్యాదు లో పేర్కొన్న సురేష్
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం
-ఎస్ఐ జగన్‌మోహన్‌రావు
Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
అమరావతి..
-ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
-మలయాళీల ఘనమైన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక ఓనం పండుగ.
-ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న మలయాళీ సోదరులందరికీ శుభాకాంక్షలు.
-మీ ఇంట ఈ ఆనంద సిరులు శాశ్వతంగా ఉండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.