YSR JALAKALA; వైఎస్సార్ జలకళ ప్రారంభోత్సవం
శ్రీకాకుళం జిల్లా: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ జలకళ ప్రారంభోత్సవ కార్యక్రమం..
పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కళావతి, కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ జె.నివాస్..
Gurram Jashuva: గుర్రం జాషువా 125 జయంతి వేడుకలు...
విశాఖ..
-గుర్రం జాషువా 125 జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో జాషువా విగ్రహానికి పూలమాల వేసి,నివాళిలు అర్పించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు
-పాల్గొన్న అధికార బాష సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ,ఎమ్మెల్యేలు గొల్లబాబురావు,అదీప్ రాజు,వైసిపీ శ్రేణులు.
-మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్..
-గుర్రం జాషువా కీర్తిని రాబోయే తరాల వారికి గుర్తిందే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెలుతుంది.
-గుంటూరులో మూడు కోట్ల రూపాయలతో కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నాము.
-తెలుగువారు గర్వించతగ్గ కవి జాషువా.
-సామాన్య ప్రజలకు కూడా అర్థం మయ్యేవిధంగా జాషువా రచనలు ఉంటాయి.
-14 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేశారు.
-దళితులపై దాడులు చేసినా,దళితులకు అన్యాయం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
Guntur updates: అంటరానితనం, అసమానతల పై జాషువా తన కవితలతో పోరాటం చేశాడు..
గుంటూరు ః....
-గుఱ్ఱం జాషువా 125 వ జయంతి సందర్భంగా జాషువా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ,
-మంత్రి సురేష్..
-జాషువా కళా ప్రాంగణం నిర్మాణ త్వరలో ప్రారంభిస్తాం.
-జాషువా సమాధిని స్మృతి వనం గా అభివృద్ధి చేస్తాం.
-జాషువా ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ దళితుల అభివృద్ధి కి కృషి చేస్తున్నారు.
-ప్రతిపక్షాలు కులాలను అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేస్తున్నాయి.
-కులరాజకీయాలతో అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
-దళిత సంఘాలు అన్ని ఏకమై జగన్ కు అండగా నిలవాలి.
-ప్రతిపక్షలు చేస్తున్న రాజకీయాలను.... తిప్పికొట్టాలి...
Amaravati updtaes: నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ జలకళ పథకం ప్రారంభం...
అమరావతి..
-క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
-రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు
-వైయస్‌ఆర్ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు
-5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు
-దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం
-శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా..
Amaravati updates: గుర్రం జాషువా గారి ఆలోచన మేరకే నేడు వైఎస్ జగన్ ప్రభుత్వం నడుస్తోంది..
అమరావతి..
-మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే
-ప్రతిపక్షాలు చేతగాని రాజకీయాలతో కులాలు, మతాలను వాడుకుంటున్నాయి
-డొక్కా మాణిక్య వర ప్రసాద్, ఎమ్మెల్సీ
-ఆయన సాహిత్యం, విలువలు విశ్వ వ్యాప్తం అయ్యాయి
-ఆయన అణగారిన వర్గాల అభివృద్ధికి ఎన్నో మార్గాలు చూపి చైతన్యం తెచ్చారు
-తెలుగు భాషకు వన్నె తెచ్చిన జాషువా కి నివాళులు..
Amaravati updates: నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి జాషువా..
అమరావతి..
-మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు..
-ఇలాంటి మహానుభావులు చూపిన మార్గంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళుతున్నారు
-బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఓటు బ్యాంకు కే పరిమితం కాకూడదని సీఎం జగన్ పోరాడుతున్నారు
-దళితులపై దాడులు అంటూ కొత్త రాజకీయం తెర మీదకు తెస్తున్నారు
-వారి కుల రాజకీయాలు చెల్లవు..
Amaravati updates: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు..
అమరావతి..
-జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి అదిమూలపు సురేష్,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి..
అదిమూలపు సురేష్, మంత్రి
-గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
-జాషువా సమాజ హితం కోసం ఎన్నో రచనలు చేశారు
-ప్రతిపక్షాలు దళితులపై దాడులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు
-దళితులను గౌరవించే పార్టీ, ప్రభుత్వం మాది
-గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసు
-దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి మా నేత వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు..
Kadapa district updates: గండికోటకు కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం... :
కడప :
-జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 7000, వర్షాల వల్ల పరివాహక ప్రాంతం నుంచి 9500 క్యూసెక్కుల నీరు రాక
-గండికోట జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 16.2 టీఎంసీలు...
-మైలవరానికి 15200 క్యూసెక్కులు విడుదల
-గండికొటలొ నీటి నిల్వ పెరుగుతుండటంతో ముంపు గ్రామమైన తాళ్ల పొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లో పెరిగిన వరద నీరు...
-నీట మునిగిన తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఎస్సీ కాలనీ... ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపొతున్న ప్రజలు
-పరిహారం, మౌలిక వసతుల అందకుండానే ఖాళీ చేసి తలో దిక్కు వెళ్ళిపోతున్న కాలనీ వాసులు..
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు..
తిరుమల:
విజయసాయి రెడ్డి..
-ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది..
-రాజ్యాంగంలో వ్యవస్థల పరిధి,పరిమితులు స్పష్టంగా చెప్పబడి ఉన్నా రాజ్యాంగానికి విరుద్దంగా కొంతమంది స్వార్థం కోసం పనిచేస్తున్నారు..
-అలాంటి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను..
Vijayawada updates: కృష్ణనదికి వరద ఉధృతి..
విజయవాడ..
- కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్..
-ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
-ఇన్ ఫ్లో 6,73,287 క్యూసెక్స్, అవుట్ ఫ్లో 6,67,842 క్యూసెక్కులు
-కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :- కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్