Bangalore riots updates: బెంగళూరు విధ్వంశం పై న్యాయవిచారణ
-కర్ణాటక: బెంగళూరు నగర శివారులో దేవర జీవన హళ్ళి, కాడు గొండనహళ్లి పరిధిలో జరిగిన విధ్వంసం పై న్యాయ విచారణ
-జిల్లా అధికారి శివమూర్తి ఘటన జరిగిన రెండు ప్రాంతాల్లో పర్యటన
-విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో కాలిపోయిన బైకులు, పోలీస్ స్టేషన్ల లో జరిగిన నష్టాలను అంచనా వేసిన అధికారులు.
-మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 11న రాత్రి 7 నుంచి వేకువజామున నాలుగు గంటల వరకూ జరిగిన అన్ని ఘటనలపైన విచారణ చేయనున్న జిల్లా అధికారి.
-సెప్టెంబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడి
-మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న విచారణాధికారి
Visakhapatnam updates: నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
విశాఖ..
-నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
-మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం జగన్ సమక్షంలో చేరనున్న రమేష్ బాబు
-2009 పెందుర్తి, 2014 యలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు..
-టీడీపీ విశాఖ రూరల్ అధ్యక్షుడు గా పని చేసిన పంచకర్ల ఇటీవల పార్టీ కి దూరంగా వుంటూ..నేడు వైసీపీ లో చేరుతున్నారు.
Visakhapatnam weather updates: ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం...
విశాఖ..
-వెదర్ అప్ డేట్
-ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....
-మూడురోజుల్లో మధ్యప్రదేశ్ మీదుగా పయనించి బలహీన పడుతుంది..
-రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి..
-ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర లో తేలికపాటి వర్షాలు
Srisailam project updates: జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి..
కర్నూలు జిల్లా....
-శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి
-6 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
-ఇన్ ఫ్లో : 1,27,342 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,35,071 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 884.60 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Anantapur updates: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం
అనంతపురం..
అనంతపురం: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం
కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు
ఖరీఫ్ పంటల సాగు, పంట పరిస్థితులు, రబీలో సాగు తదితర అంశాలపై కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం
Anantapur updates: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్..
అనంతపురం..
-అనంతపురం: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్.
-కార్లను అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన విషయం లో వెంకట రమేష్ నిందితుడు.
-నిందితుడిపై పుట్లూరు, అనంతపురం రెండో పట్టణ పోలీసు స్టేషన్ల లో కేసులు నమోదు
Anantapur updates: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.
అనంతపురం..
-అనంతపురం: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.
-అనంతపురం జిల్లా నుంచి కర్ణాటక లోని బెంగళూరు ఇతర పట్టణాలకు ఆర్టీసీ బస్సుల కొనసాగింపు.
-లాక్ డౌన్ సమయం లో రెండు రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరణ
Ananthapur updates: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.
అనంతపురం...
-అనంతపురం: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.
-ఢిల్లీకి చెందిన ఎక్స్ప్రెస్ ఇండియా గ్రూప్ సంస్థ ఆన్లైన్లో అవార్డు అందజేత.
-సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి హై అలర్ట్ అప్లికేషన్ యాప్ ను రూపొందించేందుకు ఎస్పీకి అవార్డు ప్రధానం.
Vijayawada health updates: విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు
విజయవాడ...
-విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు
-వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ళ నాని
-కరోనా మహమ్మారిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘మాస్కే కవచం’
-నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం
-కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ‘మాస్కే కవచం’ ముఖ్య ఉద్దేశం
-ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయాలి
-ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదు
-ఇళ్లల్లో వయసు మీరిన వారికి కోవిడ్ రాకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
-బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి
-నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలి