Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-28 00:26 GMT
Live Updates - Page 2
2020-08-28 13:27 GMT

Sonu Sood Help: మరోసారి తన ఉదార్తతను చాటుకున్న నటుడు సోనూసూద్

- మరోసారి తన ఉదార్తతను చాటుకున్న నటుడు సోనూసూద్

- చదవాలన్న ఆకాంక్ష ఉండి ఆర్థిక పరిస్థితి లేని ఓ యువతి అభ్యర్థనను గుర్తించి ఆమె సిఎ చదవడానికి కావాల్సిన ఫీజులు కట్టి ఆమెను ఆదుకున్న సోనూ సూద్

- చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సోనియాకు చెన్నైలోని ఓ పేరుమోసిన సంస్థలో సిఏ చేరడానికి ఫీజులు కట్టిన సోనూ

- సిఎ చదవాలనుకున్న సోనియాకు ప్రోత్సాహం

- సోనూకు కృతజ్ఞత లు తెలిపిన సోనియా

- సిఎ పూర్తి చేసి ఆయన బాటలో పయనిస్తాను, నాలాంటి పేదవారికి అండగా నిలుస్తా..సోనియా

2020-08-28 13:00 GMT

Chinarajappa: అచ్చెన్నాయుడి బెయిల్‌ మంజూరు పై చినరాజప్ప కామెంట్స్

- కింజరాపు అచ్చెన్నాయుడి గారికి బెయిల్‌ మంజూరు పై చినరాజప్ప కామెంట్స్

- తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం హార్షణీయం.

- అనారోగ్యంతో ఉన్నప్పటికి అచ్చెన్నాయుడు గారిని రోడ్డు మార్గంలో నిమ్మాడ నుంచి విజయవాడ తరలించారు

- రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలోనే ఆయన కరోనా బారినపడ్డారు.

- దీంతో అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో మచ్చలేని నేత అచ్చెన్నాయుడు

- .రాజకీయ కక్ష, వేధింపులతో పెట్టిన కేసుల నుంచి అచ్చెయ్యనాయుడు బయటకొస్తారు.

- ఎమ్మెల్యే , మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప

2020-08-28 12:19 GMT

అమరావతి...

రాజధాని తరలింపు వాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మనోగతం తెలుసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నిర్ణయం..

కోర్టు ఆదేశాలు ఇంకా అందవలసి ఉంది. ఈలోగానే పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్న పవన్..

రేపు ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో రేపు టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు..

2020-08-28 12:19 GMT

అమరావతి

చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి వర్యులు

అచ్చెన్నాయుడుని రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారు.

కొల్లు రవీంద్ర అరెస్టు రాజకీయ క్రీడలో భాగమే.

న్యాయ స్థానాలు లేకపోతే మాలాంటోళ్లు ఈ ప్రభుత్వంలో బతకలేరు

15 నెలల్లో 93 సార్లు కొర్టుల ద్వారా చివాట్లు తిన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు రాజకీయ కక్షతోనే జరిపించారు.

70 రోజుల తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడం ఆనందంగా ఉంది.

అచ్చెన్నాయుడు ఏ తప్పూ చేయలేదని అందరికీ తెలిసు.

2020-08-28 12:18 GMT

త్యాగానికి ప్రతీక మొహర్రం

విజయవాడ-రాజ్ భవన్

త్యాగానికి ప్రతీక మొహర్రం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటికే పరిమితం అవుదాం

మంచి తనానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం కార్యక్రమాల వేళ అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు.

ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుకు మొహర్రం జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని గౌరవ గవర్నర్ పేర్కొన్నారు. కరోనా వేళ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు తమ నివాసాలలోనే ఉండి మొహర్రం కార్యక్రమాలను పూర్తి చేయాలని, ప్రభుత్వం, సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని గవర్నర్ పిలుపు నిచ్చారు.

2020-08-28 10:28 GMT

అమరావతి

ఉభయ గోదావరి జిల్లాల టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు, సీనియర్ నేతలు

అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైసిపి నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు

వాటర్ మేనేజిమెంట్ లో వైసిపి ప్రభుత్వం విఫలమైంది

కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసింది

వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయం

బాధితుల్లో రాజకీయాలు చూడటం ఎక్కడైనా ఉందా..?

ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా...?

తిత్లిలో నిరాశ్రయులకు రోజుకు 1,35,650మందికి భోజనాలు పెట్టాం.

10రోజుల్లో 13లక్షల మందికి భోజనాలు వండించి అందజేశాం.

ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరం

పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి

100% సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలి

వరద బాధితులను ఆదుకున్న టిడిపి నాయకులకు అభినందనలు

విపత్తు బాధితులను ఆదుకోవడం ఎన్టీఆర్ నేర్పిన సుగుణం.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తెలుగుదేశం...

బాధితులకు అండగా ఉండటం తెలుగుదేశం సామాజిక బాధ్యత.

2020-08-28 10:27 GMT

నెల్లూరు :--

-- కావలి లో సంచలనం కలిగించిన వివాహిత హత్య కేసును 24 గంటల్లో చేదించిన పోలీసులు.

-- అక్తర్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిగ్గుతేల్చిన పోలీసులు.

-- షకీలా అనే వివాహిత నిన్న దారుణంగా హత్య చేసిన అక్తర్.

-- మృతురాలు భర్తతో విడిపోయి గత కొన్నేళ్లుగా అక్తర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించినా పోలీసులు.

-- మృతురాలి పై అనుమానంతో నిందితుడు ఈ దాడికి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీస్ విచారణలో అంగీకారం.

-- నిందితుడు అక్తర్ ని అరెస్టు చేసి నట్లు వెల్లడించిన కావలి డిఎస్పీ ప్రసాద్ వెల్లడి.

2020-08-28 10:26 GMT

శ్రీకాకుళం జిల్లా..

టిడిపి నేత కూనరవి కుమార్ కామెంట్స్..

అచ్చెన్నాయుడు పై కేసు టిడిపి నేతలు పై జగన్ కుట్రల పరంపరలో భాగమే..

అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది..

ఎసిబి దర్యాప్తు జరుగుతుండగానే వైసిపి పేటియం బ్యాచ్ ఇష్టానుసారంగా వాడుతున్నారు..

కేసు పెట్టిన ఏసీబీ అధికారులే ఈ స్కాంలో అచ్చెన్నాయుడుకి డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లభ్యం కాలేదని కోర్టు చెప్పాయి..

క్విట్ ప్రోకో ద్వారా అవినీతి చేయవచ్చు అని జగన్ విషయంలో స్పష్టం అయ్యింది..

అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఎసిబినే ఆధారాలు చూపించలేకపోయింది..

అచ్చెన్నాయుడుని ఎదుర్కోలేకే వైసిపి అక్రమ కేసులు బనాయిస్తోందని స్పష్టం అవుతోంది..

జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు కాదు శ్రీకాకుళం ప్రజలు..

పోరాటాల పురిటీగడ్డలో పుట్టిన మేము కుందేళ్లు కాదు పులులం అని జగన్ గుర్తుంచుకోవాలి..

జగన్ అరాచకాలు ఎంతో కాలం సాగవు..

వైసిపి తోడేళ్లను తరిమికొట్టేందుకు తెలుగుదేశం కార్యకర్తలు సింహాల్లా గర్జించేందుకు సిద్ధం కావాలి..

2020-08-28 08:19 GMT

Chittoor district updates: దళిత యువకుడు ఓంప్రతాప్ మృతిపై న్యాయవిచారణ....

చిత్తూరు జిల్లా....

-సదుం మండలం లో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు ఓంప్రతాప్ మృతిపై న్యాయవిచారణ జరపాలి.

-50 లక్షలు పరిహారం ఇవ్వాలి.

-డా సప్తగిరిప్రసాద్

-మాజీ డైరెక్టర్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

2020-08-28 08:15 GMT

YSR Vedadri Lift Irrigation Project News: కృష్ణా జిల్లా.... వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సిఎం జగన్

కృష్ణా జిల్లా....

-వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సిఎం జగన్

-రిమోట్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుండి పైలాన్ ఆవిష్కరించిన సీఎం

-కార్యక్రమానికి హాజరైన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే లు సామినేని ఉదయభాను, జగన్మోహన్ రావు, కైలే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు ప్రజాప్రతినిధులు , అధికారులు

-జగ్గయ్యపేట నియోజకవర్గంలో38 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది

-జగ్గయ్యపేట మండలంలో 8గ్రామాలు, వత్సవాయి మండలం లో10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలం లో10 గ్రామాలు

-మొత్తం28 గ్రామాలలో 38,607 ఎకరాలకు సాగు నీరు

-సిఎం జగన్ కామెంట్స్

-గత ప్రభుత్వం వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించింది

-మేం వచ్చిన 14 నెలల్లోనే పథకానికి శ్రీకారం చుట్టాు o

-2021 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం

-491 కోట్లు వ్యయంతో నిర్మాణం.

Tags:    

Similar News