సిద్దిపేట జిల్లా:
- సిద్ధిపేట పట్టణంలోని బారాయిమామ్- చిన్న మసీదు సమీపంలో మంగళవారం ఉదయం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో 142 పాజిటివ్ కేసులు నమోదు
- నిజామాబాద్ జిల్లాలో 142 పాజిటివ్ కేసులు నమోదు
- ఇందులో నలుగురు జర్నలిస్టులు..
Gokul Chat: గోకుల్ చాట్ లుంబినీ పార్కు జంట పేలుళ్లకు నేటికి పదమూడేళ్లు పూర్తి..
- గోకుల్ చాట్ లుంబినీ పార్కు జంట పేలుళ్లకు నేటికి పదమూడేళ్లు పూర్తి..
- 2007 ఆగష్టు 25 న జరిగిన పేలుళ్లు...
- ఈ జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృతి
- వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు....
- పేలుళ్లకు పాల్పడిన నిందితులకు శిక్ష ఖరారు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు...
- ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు శిక్ష ఖరారు చేసిన NIA కోర్టు ...
- ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషిగా తేల్చిన NIA కోర్టు....
- పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ సంస్థ....
- శిక్ష ఖరారు చేసిన ఇప్పటి వరకు అమలు కానీ తీర్పు...
Nampally: చైనా ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో నేడు సిసిఎస్ కస్టడికి నిందితులు
బ్రేకింగ్ న్యూస్...
- చైనా ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో నేడు సిసిఎస్ కస్టడికి నిందితులు
- 4రోజుల కస్టడీ కి ఇచ్చిన నాంపల్లి కోర్టు
- చంచల్ గూడ జైలు నుండి ఒక చైనా దేశస్థుడుతో పాటు మరో ముగ్గురు నిందితులను సిసిఎస్ కు తరలించనున్న పోలీసులు
- నలుగురు వ్యక్తులు ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ స్కాం లో ఇంకా ఎంతమంది ఉన్నారో అనే కోణం మీద దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు.
- ఇప్పటికే రెండువేల కోట్లకు పైగా స్కాం జరిగినట్టు గుర్తింపు
- చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీ కీ బదలీ బదిలీ అయిన నగదుపై దృష్టి పెట్టిన పోలీసులు
- రెండు అకౌంట్లు ద్వారా హెచ్ ఎస్ బి సి బ్యాంకు అమౌంట్ ద్వారా బదిలీ చేసినట్లు నిర్ధారణ
- ఆన్లైన్ బెట్టింగ్ వచ్చిన డబ్బులు పేటీఎంలో డిపాజిట్ చేయించిన చైనా కంపెనీ.
- అయితే విచారణలో మరి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు
- మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది
- ఇప్పటికే పేటీఎం ప్రతినిధులను విచారించిన పోలీసులు
- దాకీపే, లింక్ యూ కంపెనీల పేరుతో నగదు బదలాయింపు
- మరో రెఃడు కంపెనీల గుర్తింపు
- పరారీలో డిల్లీకి చెందిన మరో కీలక నిందితుడు ధీరజ్....
Nizamabad: ఏడాది వయసున్న కొడుకును కిడ్నాప్ చేసిన ఓ యువకుడు
నిజామాబాద్
- తల్లి కి మాయమాటలు చెప్పి ఏడాది వయసున్న కొడుకును కిడ్నాప్ చేసిన ఓ యువకుడు
- ఈ నెల 11 న నిజామాబాద్ బస్టాండ్ లో ఘటన
- ఈ రోజు కిడ్నాపర్ ను గుర్తించిన బాధితురాలు
- స్థానికుల సహకారంతో పట్టుకుని దేహశుద్ది
- పోలీసులకు అప్పగింత
- బాబు ఆచూకీ కోసం కొనసాగుతున్న విచారణ
Tahasildar case updates: కీసర తహశీల్దార్ కేసులో నలుగురు నిందితులు నేడు కస్టడీకి
- తహశీల్దార్ నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజ్ మూడు రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్....
- నిందితులను ఈనెల 27 వరకు విచారించనున్న ఏసీబీ
- చంచల్ గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ...
- కోటి 10 లక్షల రూపాయల పై కూపీ లాగనున్న ఏసీబీ...
- ఎమ్మార్వో నాగరాజు అక్రమాలు, ఆస్తులు, భినామీల లెక్క తేల్చనున్న ఏసీబీ
- తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేయనున్న ఏసీబీ...
- ఆంజిరెడ్డి నివాసంలో దొరికిన ప్రజా ప్రతినిధికి చెందిన లెటర్ హెడ్స్, డాక్యుమెంట్స్ పై విచారించనున్న ఏసీబీ
- ఈకేసులో అధికారులు లేదా ఇతరుల పాత్రపై విచారించనున్న ఏసీబీ
Road accident at Nacharam: నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
- చర్లపల్లి నుంచి వస్తున్నా భారత్ గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ బోల్తా..
- చర్లపల్లి నుంచి మల్లాపూర్ వైపు వస్తున్నా లారీ ఎఫ్ సి ఐ రోడ్ లో ప్రమాదం..
- రోడ్ పక్కనే ఉన్నా మహేందర్ (11) అనే అబ్బాయి పై లారీ పడటం తో అక్కడికక్కడే మృతి.
- ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమం లో గాస్ లారీ బోల్తా..
- డ్రైవర్ (కృష్ణ) కి తీవ్ర గాయాలు...
-మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి కి తరలించిన పోలీసులు
Sriram Sagar Project Updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
నిజామాబాద్ :
- శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
- ఇన్ ఫ్లో 8854 వేల క్యూసెక్కు లు
- ఔట్ ఫ్లో 1458 క్యూసెక్కు లు
- పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీ లు
- ప్రస్తుత నీటి మట్టం 1088.90 అడుగులు, 79.301టీఎంసీ లు
Restrictions on tourists: పోచారం ప్రాజెక్టు కు పర్యాటకుల నిషేధం.
కామారెడ్డి :
- నాగిరెడ్డి పేట మండలం పోచారం ప్రాజెక్టు కు పర్యాటకుల నిషేధం.
- అలుగు పారుతున్న పోచారం అందాలను తిలకించేందుకు భారీగా వస్తున్న పర్యాటకులు.
- కారోనా నేపధ్యం లో..ప్రాజెక్టు కు వెళ్లే రెండు దారుల మూసివేత.
Kaleswaram Project Updates: సరస్వతి బ్యారేజ్ ( కాళేశ్వరం ప్రాజెక్టు ) కు తగ్గిన వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- సరస్వతి బ్యారేజ్ ( కాళేశ్వరం ప్రాజెక్టు ) గేట్లు మూసిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
- ఇన్ ఫ్లో 25,000 క్యూసెక్కులు
- ఔట్ట్ ఫ్లో 20,000 క్యూసెక్కులు