Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-24 00:46 GMT
Live Updates - Page 2
2020-08-24 10:42 GMT

అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కామెంట్స్...

అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, అధికారులు రావాల్సి ఉంటుంది

కోవిడ్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు

వర్చువల్ మీటింగ్ కు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా.

ఐటి పరంగా అభివృద్ధి చెందిన తెలంగాణలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఐటి మంత్రి కేటీఆర్ ... వర్చువల్ మీటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

2020-08-24 08:12 GMT

Degree Admissions: నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు.

దోస్తు పక్రియ లో భాగంగా డిగ్రీ అడ్మిషన్లు రిజిస్ట్రేషన్లు. చేయనున్న వర్శిటీ అధికారులు.

2020-08-24 08:07 GMT

CoronaUpdates In Nizamabad: నిజామాబాద్ లో కోవిడ్ టెస్టు సెంటర్ల పెంపు

నిజామాబాద్ : జిల్లాలో కోవిడ్ టెస్టు సెంటర్లు పెంచిన అధికారులు.

127 కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు.

భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు.

రెండు రోజుల వ్యవధిలో 797 కేసుల నిర్ధారణ.

బోధన్ లో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న 30 మంది కి వైరస్. 

నూతన వదు వరులకు పాజిటివ్.

2020-08-24 08:03 GMT

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

8గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తివేత.

ఇన్ ఫ్లో :1,54,886 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో : 1,54,486 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 305.5646 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 587.00 అడుగులు.

2020-08-24 08:00 GMT

Pulichinthala Project: నిండు కుండ‌లా పులిచింతల ప్రాజెక్టు

సూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టు update

ప్రాజెక్టు సామర్థ్యం 45,77 TMC. లు.

ప్రస్తుతం నీటి నిల్వ.45.77.tmc లు..

ఇన్ ప్లో..1.94.414.క్యూసెక్కులు. 6గేట్లు ఎత్తివేత..

అవుట్ ఫ్లో..2.00414. క్యూసెక్కులు.

2020-08-24 07:55 GMT

Dead Body గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ వంతెన కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

2020-08-24 07:53 GMT

మహబూబాబాద్: కేసముద్రం విలేజ్ గిర్నితండా లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య ,

తలలేని మొండెం లభ్యం దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

2020-08-24 07:49 GMT

Online Betting scam: ఆన్ లైన్ బెట్టింగ్ స్కాంపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న ఈడీ..

ఆన్ లైన్ బెట్టింగ్ స్కాంపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న ఈడీ..

నేడు నలుగురు నిందితులను కస్టడీ లోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు..

బెట్టింగ్ స్కాంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు..

రెండు అకౌంట్ నుంచి చైనా కు నిధులు బదిలీ అయినట్టు గా గుర్తింపు..

దాకి పే, లింక్ యూ కంపెనీల పేర్లతో నిధుల బదిలీ..

కీలక నిందితుడు ఢిల్లీ కి చెందిన ధీరజ్ కోసం గాలిస్తున్న పోలీసులు..

రెండువేల కోట్లకు పైగా స్కాం జరిగినట్లు గా తేల్చిన పోలీస్.

మరొక రెండు కొత్త అకౌంట్లను గుర్తించిన సిసిఎస్ పోలీసులు..

ఇప్పటికే పేటీఎం ప్రతినిధులను ప్రశ్నించిన పోలీసులు..

చంచల్ గూడ జైలు నుండి నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు..

ఆన్ లైన్ గేమ్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరు అన్న కోణం దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు..

విదేశాలకు పెద్ద ఎత్తున హవాలా రూపంలో వెళ్లినట్టు గుర్తించిన ఈడీ.

2020-08-24 07:31 GMT

Komuram bheem: అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం.

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం..

ఇ. ఎస్.ఐ. కాలనీ సమీపంలోని పాడు పడ్డ క్వార్టర్స్ లో మృతదేహం లభ్యం..

పట్టణానికి చెందిన సాబీర్ అలీ (30) గుర్తించిన పోలిసులు విచారణ చేపట్టిన పోలీసులు...

2020-08-24 07:27 GMT

Nepali Thieves In Kokapet: హైద‌రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌

హైదరాబాదులో నేపాల్ కు చెందిన కైలాలీ ముఠా సంపన్నుల ఇండ్లు వీరి టార్గెట్.. 

ఇంట్లో పనికి చేరుతారు నమ్మకం గా నెలల పాటు పనిచేశారు....

సమయం వచ్చినప్పుడు కోట్లల్లో చోరీ చేసి పారిపోతారు..

కుషాయిగూడ సైనిక్ పూరి చోరీకేసులో ఇదే ముఠాకు చెందిన ఐదు మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు..

దాదాపు రెండు కోట్లకు పైగా చోరీ చేసి నేపాల్ కు పారిపోయిన ముఠా సభ్యులు..

అందులో ఒకరిని గుర్తించి అక్కడి పోలీసుల సహాయంతో కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు..

మిగతా వారిని గుర్తించినప్పటికీ నేపాల్ నుండి ఇక్కడికి తీసుకు రావడానికి చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు పోలీసులు..

కొద్ది రోజుల క్రితం సైబరాబాద్ పరిధిలోని కోకాపేట్ లో కూడా ఇలాంటి చోరీని చేసి పారిపోయిన నేపాల్ కు చెందిన వాచ్మెన్ దంపతులు.....

Tags:    

Similar News