CWC Meeting: ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ.
జాతీయం: ప్రారంభమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం.
పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలోప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం .
పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గంతో ఆసక్తికరంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు
పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ .
తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోనియా సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం .
పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగడమా? లేదా నూతన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమా సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్న సీడబ్ల్యూసీ సభ్యులు .
SP Balu News: ఎస్పి బాలుకు నెగిటివ్ రిపోర్ట్ .. అధికారిక ప్రకటన రాలేదు
ఉదయం జరిపిన కోవిడ్ పరీక్ష లో ఎస్పి బాలుకు నెగిటివ్ రిపోర్ట్...
ఇంకా అధికారికంగా ప్రకటించని ఆసుపత్రి వర్గాలు
ఎస్పీ చరణ్ సన్నిహితులు పలు సామాజిన మాధ్యమాలలో పోస్టులు
Podur SI: పొందూరు ఎస్సై రామకృష్ణ కీచక పర్వం
శ్రీకాకుళం జిల్లా: కేసు మాఫీ చేయాలంటే కామ కొర్కెలు తీర్చాలంటూ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేసిన పొందూరు ఎస్సై రామకృష్ణ..
ఇంటి అడ్రస్ చెప్పి నేరుగా ఇంటికి రావాలంటూ ఫోన్ లో బాధితురాలిపై ఒత్తిడి..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎస్సై ఫోన్ ఆడియో రికార్డింగ్..
రెండు రోజుల క్రితం అక్రమ మద్యం కేసులో పొందూరు మండలం తుంగపేటకు చెందిన అన్నెపు అప్పారావును అరెస్టు చేసిన ఎస్సై రామకృష్ణ..
48 మద్యం బాటిల్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎస్సై రామకృష్ణ..
తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తన కోర్కెలు తీర్చాలంటూ నిందితుని కుమార్తెను బ్లాక్ మెయిల్ చేసిన ఎస్సై రామకృష్ణ..
Robbery: దొంగల బీభత్సం
అనంతపురం : గుత్తి ఆర్.ఎస్. లోని సూర సింగనపల్లి కాలనీలో దొంగల బీభత్సం.
4 ఇళ్ళల్లో చోరీ , 60వేలు నగదు , 16తులాల బంగారు ఆభరణాలు, కీలో పైగా వెండి (కృష్ణుడి విగ్రహం),30వేలు విలువ చేసే పట్టు చీరలు అపహరణ..
Dawaleshwaram Project: ధవలేశ్వరం వద్ద 15.30 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం
తూర్పుగోదావరి రాజమండ్రి:
ధవలేశ్వరం వద్ద 15.30 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం
15 లక్షల 33 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
Vijayawada Crime News: వాంబేకాలనీలో దారుణ హత్య
విజయవాడ: విజయవాడ నగర శివారు వాంబేకాలనీలో దారుణ హత్య
రామకృష్ణ అనే వ్యక్తిని హత్య చేసిన గంజాయి బ్యాచ్
గంజాయి బ్యాచ్ తో గొడవకారణంగా హత్య జరిగి ఉండవచ్చంటున్న స్ధానికులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న గ్రామీణ పోలీసులు
B.Ed Exams: సెప్టెంబర్ 21 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
అనంతపురం: ఎస్కేయూ పరిధి లో సెప్టెంబర్ 21 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు.
ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు, విద్యార్థులు కోరుకున్న కేంద్రాల్లో నే పరీక్షలు.
94 Year-Old Woman Survives Covid-19: కరోనాను జయించిన 94 ఏళ్ల బామ్మ.
అనంతపురం: కరోనాను జయించిన 94 ఏళ్ల బామ్మ.
గార్లదిన్నె మండలం కొట్టాలపల్లి కి చెందిన వెంకటలక్ష్మమ్మ కరోనా నెగటివ్.
కరోనా బారిన పడి పుట్టపర్తి లో చికిత్స తీసుకున్న వెంకతలక్ష్మమ్మ కొలుకున్నట్లు ప్రకటించిన అధికారులు.
Boat accident in East Godavari: లాంచీ కోసం కొనసాగుతోన్న గాలింపు
తూర్పుగోదావరి : శబరిలో మునిగిపోయిన లాంచీ కోసం కొనసాగుతోన్న గాలింపు..
నాలుగు రోజుల క్రితం నిత్యావసరాలు తీసుకుని వెళ్తూ శబరి నది పై వంతెనను ఢీ కోట్టిన లాంచి..
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ముగ్గురు వ్యక్తులు..
ఇప్పటి వరకు లభ్యం కానీ లాంచీ సారంగు పెంటయ్య ఆచూకీ..
మోతుగూడెం జెన్కోకు చెందిన క్రేన్‌తో సాయంతో ఐదవ రోజు కొనసాగుతోన్న గాలింపు..
ఆందోళనలో సారంగు పెంటయ్య కుటుంబసభ్యులు.. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం నకు చెందిన పెంటయ్య..