Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-23 01:00 GMT
Live Updates - Page 3
2020-10-23 09:26 GMT

Nara Lokesh: రైతులకు ఈ సారి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు...

  అనంతపురం:

* నారా లోకేష్ ప్రెస్మీట్

*ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు

*ప్రతిపక్ష నేత వస్తే హడావుడి గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు

*రూ.2వేల కోట్లు వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగింది

*ఇప్పటివరకు కేవలం రూ. 25 లక్షలు మాత్రమే నష్ట పరిహారం ఇచ్చింది

*మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం ఇవ్వడం లేదు

*15 నెలలుగా ఇన్ ఫుట్ సబ్సిడీ ...డ్రిప్ ఇరిగేషన్.. ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు.

*టీడీపీ నేతలపై కేసులు పెట్టడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించింది.

*మంత్రులు సహా ఎవ్వరు సమీక్షలు జరపడం లేదు

*ప్రభుత్వం తక్షణమే స్పందించాలి... రైతులను అవమానించే విధంగా యంత్రాంగం ప్రవర్తిస్తుంది

*టీడీపీ రైతు సమస్యలపై పోరాడితే మినహా ప్రభుత్వం స్పందించడం లేదు

*పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

2020-10-23 09:23 GMT

Guntur district updates: టిడిపి కి పూర్వ వైభవం రావడానికి నేడు ప్రారంభదినం.

  గుంటూరు ః....

*మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

*ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పై పూర్తి స్థాయిలో పని చేస్తున్నాం.

*వైసిపి ప్రభుత్వం నియంత్రుత్వ పొకడలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.

*గుంటూరు పార్లమెంటు పరిధిలో వైసిపి కి ఎదురుదెబ్బ తగలక తప్పదు.

2020-10-23 09:18 GMT

Jayadev Galla: న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయి..

 గుంటూరు ః....

*ఎంపీ గల్లా జయదేవ్

*దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది

*2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలి

*అంతిమ విజయం మనదే అవుతుంది

*న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

*ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగింది.

*తాను జైలుకు వెళ్ళిన ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు

2020-10-23 09:13 GMT

Guntur district updates: నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తా..

  గుంటూరు.. 

-గుంటూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్..

-అందరినీ కలుపుకుని పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా

-రాష్ట్ర ప్రజలకు ఇపుడు ప్రభుత్వమే సమస్యగా మారింది

-అందుకే ప్రజలు న్యాయస్థానాల వైపు చూస్తున్నారు

-త్వరలో ఈ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయం

-ఈ లోపే వీలైనంత దోచుకోవాలని జగన్ రెడ్డి తాపత్రయం

-పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం

-ఆయనకు అన్ని విషయాల్లో అండగా నిలబడదాం

2020-10-23 09:05 GMT

East godavari updates: మద్యం తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు..

  తూర్పుగోదావరి :

  ఎక్సైజ్ సిఐ లక్ష్మీ..

--తెలంగాణ మద్యం తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు..

--నిన్న రాత్రి ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు కత్తిపూడి లో వాహనాలు తనిఖీలో లభించిన తెలంగాణ మద్యం..

--రూ. లక్షా, 34 వేల విలువైన 112 టిన్ బీర్లు, 72 ఫుల్ బాటిళ్ల తెలంగాణ మద్యం సీజ్ చేశాము..

--నిందితుల నుంచి రూ. 7 వేల నగదు, ఏపి 16 సిఎల్ 6888 డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నాము..

2020-10-23 08:57 GMT

Nellore district updates: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం...

  నెల్లూరు :--

-- గత అర్ధరాత్రి హైవే తనిఖీల్లో బయటపడ్డ అక్రమ రవాణా.

-- టాటా ఐషర్ వాహనం లో దోసకాయలు మాటున ఎర్రచందనం అక్రమ రవాణా ఎర్రచందనం

-- తమిళనాడు కి చెందిన బడా స్మగ్లర్ అతని కారు సహా 50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

-- పట్టుబడ్డ నిందితుల సమాచారంతో రాపూర్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన చిల్లకూరు పోలీసులు.

-- కలువాయి మండలం రాజుపాలెం అటవీ బీట్ పరిధిలో 41 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

-- అక్రమ రవాణాలో బేస్ క్యాంపు సిబ్బంది?

2020-10-23 08:51 GMT

Vijayawada updates: నేడు ఇంద్రకీలాద్రి కి నిపుణుల కమిటీ రాక...

  విజయవాడ..

-కొండచరియలు పై పటిష్టమైన చర్యలు పై దృష్టి పెట్టిన అధికారులు

-ఇంద్రకీలాద్రిపై ఉన్న కొండచరియలు పరిశీలించిన తరువాత నివారణ చర్య

-సీఎం ప్రకటించిన 70 కోట్లలో మొదటి ప్రాధాన్యత కొండచరియలు పడకుండా నివారించడానికి...

2020-10-23 08:49 GMT

Tadepalli updates: పట్టణ పరిధిలో కుంగిన భూమి...

  తాడేపల్లి..

* పట్టణ పరిధిలోని 17 వ వార్డ్ మార్కెట్ సెంటర్ వద్ద కుంగిన భూమి

* ఒక్కసారిగా కుంగటంతో రోడ్డు మధ్యలో 6 అడుగుల మేర ఏర్పడ్డ పెద్ద గొయ్యి

* ప్రమాదానికి గురైన ఓ కుటుంబం

* రహదారి కుంగిన సమయంలో వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం

* అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్కేకు మీడియా ప్రతినిధులు జరిగిన విషయం వివరించడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి తక్షణమే రోడ్డు మరమ్మత్తులు   చేయాలని   అధికారులకు ఆదేశం

* మరమ్మతులు పూర్తియ్యే వరకు రాకపోకలు నిలిపివేయాలని సూచించిన ఎమ్మెల్యే ఆర్కే

2020-10-23 08:42 GMT

Alapati Rajendra Prasad comments: సామాన్యుడికి రాజకకీయం నేర్పింది టిడిపి....

  గుంటూరు...

* మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్..

* ఎంతో మంది పార్లమెంటు సభ్యులుగా టిడిపి లో పని చేశారు.

* దళితుడిని జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా చేసిన ఘనత టిడిపి ది.

* ప్రజలలో నిలిచిపోయిన పార్టీ టిడిపి.

* జిల్లా నాయకత్వం వహించనున్న శ్రావణ్ కుమార్ కు అభినందనలు.

* సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు.

* సైబరాబాదు లేకపోతే హైదరాబాద్ ఎడారి అయ్యేది.

* దాతృత్వంతో ఏర్పడిన అమరావతి ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

* అమరావతినే రాజధానిగా కొనసాగించేలా పోరాటం చేయాలి.

2020-10-23 08:33 GMT

Guntur district updates: శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం....

   గుంటూరు జిల్లా... 

--గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం....

--జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,ప్రత్తిపాటి   పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,మాజీ ఎమ్మెల్యే లు,జిల్లా పార్టీ నేతలు.

--శ్రావణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జయలక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి....

Tags:    

Similar News