Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-23 00:23 GMT
Live Updates - Page 3
2020-08-23 14:52 GMT

Ration Rice Seize: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

పొదలకూరులో 3,500 కేజీల రేషన్ బియ్యం పట్టివేత.

వెంకటగిరి నుంచి నెల్లూరు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పొదలకూరు పోలీసులు..

ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు అధికారులు


2020-08-23 14:50 GMT

Godavari Floods Updates: ముంపు ప్రాంతాలలో పర్యటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు.

రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో పర్యటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు.

కరోనా పేషెంట్లు సౌకర్యం కోసం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేస్తాం

ముంపుకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

సీఎం జగన్మోహన్ రెడ్డి దయవల్ల వరం వల్ల నేను మంత్రిని అయ్యాను.

ఈ ప్రాంత వాసి గా ఇక్కడ సమస్య నాకు తెలుసు అని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను.

తెలుగుదేశం పార్టీ పాశవిక చర్యలకు పాల్పడుతోంది.

అభివృద్ధి పథకాలను అడ్డుకోవడానికి కోర్టులో కేసులతో పాశవిక చర్యలకు పాల్పడుతోంది. ట్వీట్లు చేయడానికి మాత్రమే ప్రతిపక్షం పార్టీ ఉంది.

2020-08-23 14:46 GMT

Prakasam News: బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం: ఎంపీ నందిగం సురేష్

ప్రకాశం జిల్లా: చీరాల లో పోలీసుల దాడిలో మృతి చెందిన కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నందిగం సురేష్ ..

కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ..

వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు యాతం ఆనందరావు మృతికి సంతాపం తెలుపుతూ వైకుంఠయత్ర లో పాల్గొన్న బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్, మాజీ రాజ్యసభ సభ్యులు జెడి శీలం

2020-08-23 14:42 GMT

Corona Updates in East Godavari: కాకినాడ‌లో క‌రోనా క‌ల‌క‌లం

తూర్పు గోదావరి...కాకినాడ: ఈరోజు జిల్లాలో మొత్తం 1,256కోవిడ్ కేసులు నమోదు

కాకినాడలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు -153

కాకినాడ రూరల్ నమోదైన కరోనా పాజిటివ్ కేసులు -52

49 వేలు మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

2020-08-23 09:37 GMT

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు

విజయవాడ: కృష్ణానదిలోకి ఎగువ ప్రాంతాల వాగుల నుంచి వరదనీటితో పాటు పులిచింతల నుంచి వస్తున్న వరద నీరు

ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 2 లక్షల 80వేల క్కుసేకుల

ఔట్ ఫ్లో 2 లక్షల 70 వేల క్యూసెక్కులు

పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు

నేటి సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి మరింత వరదనీరు చేరే అవకాశం

2020-08-23 09:34 GMT

Thirupathi MLA: తిరుపతి ఎమ్మెల్యే భూమన వినూత్న ప్రదర్శన

ఖాకీ బట్టలు కట్టి కుష్టురోగి బండి లాగుతూ ఇతరులకు సాయపడాలని సందేశం

కరోనా కష్టకాలంలో నలుగురికి ఉపయోగపడండి

డబ్బున్న వారు మీ చుట్టుపక్కల వారిని ఆదరించండి

లాక్ డౌన్ సమయంలో వంటకాలు చేసామని, ఇంట్లో అంట్లుతోమామని పబ్లిసిటీలు మాని పదిమందికీ పనికొచ్చే పనులు చేయండి

అన్నీ ప్రభుత్వమే చేయాలంటే సాధ్యపడదు..

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

2020-08-23 09:31 GMT

Srisailam Fire Accident: అప్రమత్తత

కర్నూలు జిల్లా: తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద సంఘటనతో అప్రమత్తమైన ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ఉన్నత అధికారులు

ముందస్తు జాగ్రత్త చర్యగా కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం భద్రతపై నిపుణులతో పరిశీలించనున్న ఏపీ జెన్కో అధికారులు

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుండి ఇ అగ్నిమాపక ఉన్నతాధికారి భద్రత నిపుణులు ఈరోజు పరిశీలించే అవకాశం

ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం భద్రతపై నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందించనున్న జెన్కో అధికారులు అప్రమత్తత 

2020-08-23 09:26 GMT

CID Raids on EX-APCO Chairman: కొనసాగుతున్న సిఐడి విచారణ

కడప : అప్కో అక్రమాలకు సంబంధించి నేడు కూడా కొనసాగుతున్న సిఐడి విచారణ...

ఖాజీపేటలో ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జుల శ్రీనివాసులు గోడౌన్లు తో పాటు

డాన్ ఖాన్ పల్లె సొసైటీ గోడౌన్ లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సిబిసిఐడి అధికారులు

2020-08-23 05:53 GMT

ThungaBhadhra project: నిండు కుండలా తుంగభద్ర

అనంతపురం: నిండు కుండలా తుంగభద్ర.

డ్యామ్ లో నీటినిల్వ: 100.547 టీఎంసీలు.

డ్యామ్ సామర్థ్యం: 100.855 టీఎంసీలు.

ఇన్ ఫ్లో: 33356 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 20179 క్యూసెక్కులు

డ్యామ్ లో నీటి మట్టం: 1632.92 అడుగులు.

పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు

2020-08-23 05:50 GMT

Srisailam power plant Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం: సహచర ఉద్యోగుల కోసం మూడు రోజులు సంతాప దినాలు

కర్నూలు జిల్లా: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన అగ్నిప్రమాదంలో అమరులైన విద్యుత్ సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని SLBHES ఎంప్లాయిస్ JAC నిర్ణయం

మొదటి రోజు గా ఉదయం భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద మౌనం పాటించనున్న విద్యుత్ ఉద్యోగులు

రేపు సాయంత్రం తెలంగాణ ఈగలపెంట టీఎస్ జెన్కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్ణయం

ఎల్లుండి సాయంత్రం మూడు గంటలకు సంతాప సభ నిర్వహణ  

Tags:    

Similar News