Telangana Latest news: విధులు బహిష్కరించి మరొక్కమారు ఆందోళనకు దిగిన గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది..
-జీతాలు పెంచినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్న సిబ్బంది..
-పెంచిన జీతాలు, కరోన స్పెషల్ అలవెన్స్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్.
-ఆసుపత్రి ఆవరణలోనే బైటాయించిన పేషంట్ కేర్, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు.
Tirumala updates: తిరుమలలో నాల్గోవ రోజు ఏకాంతంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
తిరుమల :
-కల్పవృక్ష వాహనంపై ఊభయదేవేరులతో కలిసి మలయప్ప స్వామిని కొలువు తీర్చిన ఆలయ అర్చకులు..
-కోవిడ్-19 కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు..
-మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకూ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్న అర్చకులు..
-రాత్రి 7 నుండి 8 గంటల వరకూ సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శన మివ్వనున్న మలయప్ప స్వామి..
Sriramsagar Project Updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
నిజామాబాద్
- ఇన్ ఫ్లో 171874 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 171874 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
- 40 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు
- కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో
- ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 165 టీఎంసీలు
- గోదావరి లోకి 64 టీఎంసీ లు విడుదల
Ellampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇరవై గెట్లను ఎత్తి వరదనీరు దిగువకు వదిలిన అదికారులు
- మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
- ప్రస్తుతం నీటిమట్టం147.25
- గరిష్ట నీటిమట్టం 48.00 M
- ప్రస్తుతం నీటి నిల్వ: 18.0915
- పూర్తిస్థాయి నీటినిల్వ20.175 TMC.
- ఇన్ ప్లో : 2,10,131 c/s
- అవుట్ ప్లో: 2,17,528 c/s
KCR Review Meeting: నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.
- ధరణి పోర్టల్ రూపకల్పన పై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.
- ఈ సమావేశానికి హాజరు కానున్న ఉన్నతాధికారులు , ఐటి నిపుణులు.
- ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వీలంతా త్వరగా ధరణి పోర్టల్ తీసుకురావడాని తీసుకోవాల్సిన చర్యలు, ఎప్పటి నుండి పోర్టల్ అందుబాటులోకి వస్తుందో ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం.